మలేషియాలో 'సింగం3'

  • IndiaGlitz, [Wednesday,October 14 2015]

సూర్య, హరి సూపర్ హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా వివరించనక్లర్లేదు. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన సింగం', సింగం2' చిత్రాలు భారీ విజయాలను సాధించాయి. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో ఈ హిట్ సీక్వెల్ గా సింగం 3' రూపొందనుంది. అనుష్క, శృతిహాసన్ ఇందులో నటిస్తున్నారు.

ప్రస్తుతం యూనిట్ సినిమాకి సంబంధించిన లోకేషన్స్ వేటలో ఉంది. ప్రస్తుతం హరి మలేషియా లోకేషన్స్ చూస్తున్నాడట. సినిమా ఎక్కువగా మలేషియా, బ్యాంకాక్ లో జరుగుతుందట. ప్రస్తుతం సూర్య సైంటిఫిక్, సైకలాజికల్ థ్రిల్లర్ 24' చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత సింగం 3' సెట్స్ లోకి వెళుతుందట. మరి ఈసారి సూర్య ఎలాంటి యాక్షన్ ప్యాకేజ్ ఇస్తాడో చూద్దాం.