'సింగం3' ఆడియో రిలీజ్ డేట్ ' ప్లేస్ మారింది...

  • IndiaGlitz, [Friday,December 09 2016]

తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న వెర్సటైల్ కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం సింగం-3. (ఎస్-3) తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు.

ఈ సినిమా డిసెంబ‌ర్ 23న తెలుగు, త‌మిళంలో భారీ రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతుంది. హ‌రీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుద‌లను డిసెంబ‌ర్ 11న విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌యూనిట్ ప్లాన్ చేశారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని డిసెంబ‌ర్ 17న తిరుప‌తిలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు సూర్య సినిమా వేడుక‌ల‌కు హైద‌రాబాద్ వేదిక‌గా ఉండేది అయితే ఈసారి మాత్రం సూర్య అండ్ టీం కొత్త‌గా ప్లాన్ చేసింది.

More News

మాస్ ను ఆకట్టుకుంటున్న చిరు స్వీట్ వార్నింగ్..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన 150వ చిత్రం ఖైదీ నెం150.

డిసెంబర్ 30న తెలుగు, తమిళ భాషల్లో పిజ్జా - 2

వరుస విజయాలతో దూకుడు మీదున్న తమిళ పాపులర్ హీరో విజయ్ సేతుపతి తమిళంలో నటిస్తున్న చిత్రం పురియత్ పుధీర్.

నా బెస్ట్ సెల్ఫీ ఇదే - అల్లు అర్జున్..!

బెంగుళూరు బ్లాష్టర్స్ జట్టుకు అల్లు అర్జున్ సహయాజమానిగా వ్యవహరిస్తున్నారు.

బాలయ్య సినిమాల టైటిల్స్ తో అల్లుడు సింగంలో సాంగ్..!

బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతికి ముందే స్పెషల్ ధమకా.గతంలో నందమూరి తారక రామారావు గారి సినిమాల టైటిల్స్ తో

రీ-రికార్డింగ్ పూర్తి చేసుకున్న 'ఇదో ప్రేమ లోకం'

శ్రీ శ్రీనివాసా ఫిలింస్ బ్యానర్లో ఎస్.పి. నాయుడు నిర్మాతగా సెన్సేషనల్ దర్శకుడు కోడిరామకృష్ణ శిష్యుడైన టి. కరణ్రాజ్ దర్శకత్వంలో అశోక్చంద్ర(నూతనపరిచయం), రాజా సూర్యవంశీ, తేజారెడ్డి, కారుణ్య హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకున్న చిత్రం 'ఇదో ప్రేమ లోకం'.