'సింగం3' ఆడియో రిలీజ్ డేట్ ' ప్లేస్ మారింది...
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న వెర్సటైల్ కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం సింగం-3. (ఎస్-3) తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా డిసెంబర్ 23న తెలుగు, తమిళంలో భారీ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుదలను డిసెంబర్ 11న విడుదల చేయడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని డిసెంబర్ 17న తిరుపతిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటి వరకు సూర్య సినిమా వేడుకలకు హైదరాబాద్ వేదికగా ఉండేది అయితే ఈసారి మాత్రం సూర్య అండ్ టీం కొత్తగా ప్లాన్ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com