సిమ్రాన్ అండ్ సన్స్ స్టార్ట్..
Send us your feedback to audioarticles@vaarta.com
చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేష్...ఇలా టాలీవుడ్ టాప్ హీరోస్ సరసన నటించి సక్సెస్ సాధించిన సీనియర్ హీరోయిన్ సిమ్రాన్. పెళ్లి చేసుకున్న తర్వాత మేకప్ కి పేకప్ చెప్పినా...అప్పుడప్పుడు నటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తన భర్త దీపక్ తో కలసి సిమ్రాన్ అండ్ సన్స్ పేరుతో ప్రొడక్షన్ హూస్ స్టార్ట్ చేసింది. ఈ బ్యానర్ లో డిఫరెంట్ మూవీస్ నిర్మిస్తానని సిమ్రాన్ గతంలో ప్రకటించారు.
ఇటీవల...నూతన దర్శకుడు గౌరి శంకర్ శంకర్ చెప్పిన సైన్స్ ఫిక్షన్ స్ర్కిప్ట్ సిమ్రాన్ కి బాగా నచ్చిందట. త్వరలోనే ఈ మూవీని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ మూవీలో సిమ్రాన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నటిస్తుందట. అయితే ఈ సినిమాలో నటించే హీరో, హీరోయిన్ ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com