నిఖిల్‌తో మరో కొత్త హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్‌తో సక్సెస్ సాధిస్తున్న యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా ఓ కొత్త చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నూతన దర్శకుడు శరణ్ కోపిశెట్టి డైరెక్షన్‌లో రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాత్రలో కొత్తదనం కోసం తాపత్రయపడే హీరో నిఖిల్ ఈ సినిమాలో పాత్ర కోసం బరువు పెరిగి మజిల్స్‌తో ఆకట్టుకుంటున్నాడు.
ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌లో నిఖిల్‌తో జత కడుతున్నారు. అందులో సంయుక్త హెగ్డే ఓ హీరోయిన్‌గా అల్రెడి ఎంపికైంది. తాజాగా నిఖిల్ సరసన మరో కొత్త హీరోయిన్ నటించనుంది. ఆమె పేరే సిమ్రాన్ పరింజ. హిందీలో సీరియల్స్‌లో బాలనటిగా మెప్పించి పలు అవార్డులు దక్కించుకున్న సిమ్రాన్ ఇప్పుడు నిఖిల్‌తో హీరోయిన్‌గా టాలీవుడ్ ద్వారా పరిచయం అవుతుంది. రీసెంట్‌గా ఉత్తరాఖండ్‌లోని అందమైన లోకేషన్స్‌లో ఓ సాంగ్ సహా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రముఖ యువ దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రానికి డైలాగ్స్, మరో ప్రముఖ యువ దర్శకుడు సుధీర్ వర్మ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments