సింపుల్ లవ్ స్టొరీ ఆడియో లాంచ్
Send us your feedback to audioarticles@vaarta.com
గాయత్రీ సినీ క్రియేషన్స్ పతాకం పై కుమార్ సమర్పణ లో రవి వర్మ దర్శకత్వం లో నాలుగు జంటల నూతననటీనటులతో నిర్మాతలు కుండలి పాండురంగం మరయు మద్దెల అనిల్ కుమార్ కలసి నిర్మిస్తున్న చిత్రం 'సింపుల్ లవ్ స్టొరీ'.రమేష్. ఎం అందించిన ఆడియో గీతాలు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో తెలంగాణా అతిరధ మంత్రులచే విడుదల చేయబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆడియో తొలి సిడి ని సి కళ్యాణ్ కు అందచేయగా ఎం ఎల్ ఎ రసమయి బాలకిషన్ బిగ్ సిడి ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..
తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ "చిన్న సినిమాలను ప్రోమోట్ చేయవలసిన అవసరం ఎంతనైనా ఉంది. తెలుగుసినిమాల సత్తా ఏంటో ఈ మధ్య వచ్చిన బాహుబలి, శ్రీమంతుడు సినిమాలే నిదర్శనం. అలానే చిన్న సినిమాలకు మావంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే పాటలు చాలా బాగున్నాయి. ఈ చిత్రం కూడా బాగానే ఉంటుందని నమ్ముతున్నాను. చిత్ర నిర్మాతలకు లాభాలు చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని అన్నారు.
రసమయి బాలకిషన్ మాట్లాడుతూ "తెలంగాణా రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే చిన్న సినిమా లు అడుగులు వేస్తున్నాయి. చిన్న సినిమానా పెద్ద సినిమానా అనేది నిర్ణయించేది సినిమా బడ్జెట్ కాదు సినిమా చూసే ప్రేక్షకులు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన రమేష్ సుపరిచితుడు. తనవల్లనే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. తను అందించిన ఈ పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమాలో నటించిన వారికి మరియు చిత్ర దర్శక నిర్మాతలకు నా అభినందనలు తెలియచేస్తున్నాను" అని అన్నారు.
సంగీత దర్శకుడు రమేష్. ఎం మాట్లాడుతూ "నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నా దర్శక నిర్మాతలు నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ చిత్రం లో 5 పాటలు ఉన్నాయి. అన్ని పాటలు బాగున్నాయని అందరూ అంటుంటే చాలా సంతోషంగా ఉంది" అని తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమం లో సి. కళ్యాణ్, ఎన్ శంకర్, శివ రెడ్డి, ఈ చిత్ర యూనిట్ లతో పాటు దర్శక నిర్మాతలు పాల్గొన్నారు.
హీరోలు కార్తీక్, కార్తికేయ, కిరణ్ మరయు నరేష్, హీరొయిన్ లు అమిత రావు, సమలి శర్మ, మధులగ్న దాస్, అన్విక నటించిన ఈ చిత్రం లో ప్రముఖ తారాగణం: భానుచందర్, ధనరాజ్, శివ రెడ్డి, చంటి, చిట్టి బాబు, అన్నపూర్ణ లు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: కుమార్,కెమెరా:పరంధామ, సంగీతం: రమేష్. ఎం, ఎడిటర్: వి. సత్యం, కోరియోగ్రఫీ: దిలీప్, కళాధర్, ఆర్ కె, నిర్మాతలు: కుండలి పాండురంగం, మద్దెల అనిల్ కుమార్, కథ- స్క్రీన్ ప్లే- మాటలు-దర్శకత్వం: రవి వర్మ. ఎం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout