'సింబా' ట్రైల‌ర్ డేట్

  • IndiaGlitz, [Thursday,November 01 2018]

ర‌ణ‌వీర్ సింగ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'సింబా'. సారా అలీఖాన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో సోనూ సూద్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. 2015లో విడుద‌లైన ఎన్టీఆర్ 'టెంప‌ర్‌'కు హిందీ రీమేకే ఇది. రోహిత్ శెట్టి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం స‌గ‌భాగానికి పైగా హైద‌రాబాద్‌లోనే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది.

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 3న విడుద‌ల చేయబోతున్నారు. అలాగే చిత్రాన్ని డిసెంబ‌ర్ 28న విడుద‌ల చేయ‌బోతున్నారు. క‌ర‌ణ్‌జోహార్‌, రోహిత్ శెట్టి క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.