సెప్టెంబర్ 15న శింబు, నయనతార 'సరసుడు' రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ ఛార్మింగ్ హీరో శింబు, అందాల తారలు నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ క్రేజీ కాంబినేషన్‌లో 'ప్రేమసాగరం' టి.రాజేందర్ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్ అండ్ జేసన్‌రాజ్ ఫిలింస్ బేనర్స్‌పై పాండిరాజ్ దర్శకత్వంలో తమిళ్, తెలుగు భాషల్లో టి.రాజేందర్ నిర్మించిన చిత్రం 'సరసుడు'. ఈ చిత్రం తమిళంలో 'ఇదు నమ్మ ఆళు' పేరుతో రిలీజై 27 కోట్లకు పైగా కలెక్ట్ చేసి శింబు కెరీర్‌లోనే నెంబర్‌వన్ హిట్‌గా నిలిచింది. శింబు సినీ ఆర్ట్స్‌లో 'కుర్రాడొచ్చాడు' తర్వాత తెలుగులో రిలీజవుతున్న ఈ చిత్రంపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ వున్నాయి. శింబు, నయనతార ప్రేమించుకొని బ్రేక్‌అప్ అయిన చాలాకాలం తర్వాత మళ్ళీ వీళ్లిద్దరికీ కథ బాగా నచ్చి చేసిన చిత్రం ఇది. వాళ్లిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ అన్నీ చాలా రియలిస్టిక్‌గా వుంటాయి. యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఈ చిత్రం వుంటుంది. శింబు సోదరుడు టి.ఆర్. కురళరసన్ అందించిన ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగులో సెప్టెంబర్ 15న అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
బ్యూటిఫుల్ లవ్‌స్టోరి!! హీరో శింబు మాట్లాడుతూ - ''మన్మథ', 'వల్లభ' చిత్రాలు తెలుగులో రిలీజై సూపర్‌హిట్ అయిన విషయం అందరికీ తెల్సిందే. మళ్లీ కొద్దికాలం గ్యాప్ తర్వాత 'సరసుడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఈ చిత్రం తమిళంలో రిలీజై నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తెలుగులో కూడా 'మన్మథ', 'వల్లభ' చిత్రాల కంటే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను. మా లవ్ బ్రేక్‌అప్ అయిన తర్వాత నయనతార, నేను కలిసి నటించిన ఈ చిత్రం యూత్‌కి, ఫ్యామిలీస్‌కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. అద్భుతమైన లవ్‌స్టోరీతో దర్శకుడు పాండిరాజ్ 'సరసుడు'ని చాలా బాగా తీశారు. నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ ఎక్స్‌లెంట్‌గా పెర్‌ఫార్మ్ చేశారు. నా బ్రదర్ కురళ్ అరసన్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్. ఈ చిత్రం రిలీజ్‌కి ముందే తనకి మంచి మంచి ఆఫర్స్ వస్తుండటం నాకు చాలా హ్యాపీగా వుంది. ఈ చిత్రంలో సత్యం రాజేష్ చేసిన క్యారెక్టర్‌కి తప్పకుండా మంచి రెస్పాన్స్ వస్తుంది'' అన్నారు.
యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది!!నిర్మాత టి.రాజేందర్ మాట్లాడుతూ - ''శింబు సినీ ఆర్ట్స్ బేనర్‌లో 'కుర్రాడొచ్చాడు' చిత్రంతో శింబుని హీరోగా లాంచ్ చేశాం. మళ్ళీ అదే బేనర్‌లో 'సరసుడు' చిత్రాన్ని తెలుగులో నిర్మించాం. తెలుగు, తమిళ్ బైలాంగ్వేజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించాం. తమిళంలో రిలీజై ఈ చిత్రం 27 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. డీమానిటైజేషన్ కారణంగా తెలుగు రిలీజ్ లేట్ అయ్యింది. ఇప్పుడు మంచి డేట్ చూసుకుని మా చిత్రాన్ని సెప్టెంబర్ 15న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం. సాఫ్ట్‌వేర్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేవిధంగా వుంటుంది.
ఈ చిత్రానికి మాటలు, పాటలు నేనే రాశాను. మా చిన్నబ్బాయి కురళ్ అరసన్ మ్యూజిక్ చేశాడు. నన్ను, శింబుని ఆదరించారు. ఇప్పుడు మా అబ్బాయి కురళ్ అరసన్‌ని సంగీత దర్శకుడిగా ఆదరించాలని కోరుకుంటున్నాను. శింబుని హీరోగా నేను ఇంట్రడ్యూస్ చేస్తే మా కురళ్‌ని 'సరసుడు' చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా శింబు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ క్రెడిట్ అంతా శింబుకే దక్కుతుంది. ఈ చిత్రంలోని ఒక్కొక్క సాంగ్ వెరైటీగా వుంటుంది. ఈ చిత్రంలో శింబు మెలోడీ సాంగ్ పాడారు. నేను కూడా ఒక మాస్ పాటని పాడాను. ఈ పాట మాస్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించే విధంగా వుంటుంది. శింబు సినీ ఆర్ట్స్‌లో 'కుర్రాడొచ్చాడు' సినిమా తర్వాత డైరెక్ట్‌గా రిలీజ అవుతున్న తెలుగు సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా రిలీజవుతున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించి చాలా పెద్ద హిట్ చెయ్యాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments