మే 2న శింబు, నయనతార నటించిన 'సరసుడు' ఆడియో
- IndiaGlitz, [Saturday,April 22 2017]
మొన్న.. 'మన్మథ', నిన్న.. 'వల్లభ' వంటి సూపర్‌హిట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసిన హీరో శింబు ఇప్పుడు 'సరసుడు'గా వస్తున్నాడు. నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ హీరోయిన్స్‌గా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో 'ప్రేమసాగరం' టి.రాజేందర్ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్, జేసన్‌రాజ్ ఫిలింస్ పతాకాలపై టి.రాజేందర్ నిర్మించిన చిత్రం 'సరసుడు'. ఈ చిత్రానికి శింబు సోదరుడు టి.ఆర్. కురళఅరసన్ సంగీతాన్ని అందించారు.
ఈ చిత్రంలో 5 పాటలు వున్నాయి. ఈ పాటల్ని కెనడాలో కంపోజ్ చేశారు. ఎంతో స్పెషల్ కేర్ తీసుకొని రీరికార్డింగ్ అత్యద్భుతంగా చేస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన టి.రాజేందర్ ఈ చిత్రానికి మాటలు, పాటలు రాయడం విశేషం. సింగర్‌గా, నటుడుగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్‌ఫుల్‌గా తన కెరీర్‌ని కొనసాగిస్తున్న టి.రాజేందర్ ఈ చిత్రంతో మరోసారి హైలైట్ అవ్వబోతున్నారు. మే 2న ఈ చిత్రం ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్ చేసి అదేనెలలో సినిమాని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ప్రేమసాగరం టి.రాజేందర్ మాట్లాడుతూ - ''ఐటి బ్యాక్‌డ్రాప్‌లో విభిన్నంగా సాగే ప్రేమకథ ఇది. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని పాండిరాజ్ ఎక్స్‌లెంట్‌గా తెరకెక్కించారు. రియల్ లైఫ్‌లో ఐటి రంగంలో పని చేసే యువతీ యువకులు ఎలా లవ్ చేసుకుంటున్నారు? ఎలా విడిపోతున్నారు? చివరికి వారి ప్రేమ పెళ్లిదాకా వస్తుందా? లేదా? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం వుంటుంది. ప్రజెంట్ యూత్‌కి కనెక్ట్ అయ్యేవిధంగా ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం వుంటుంది. ఈ చిత్రానికి మా చిన్నబ్బాయి, శింబు తమ్ముడు కురళ అరసన్ మ్యూజిక్ అందించాడు. ఐదు పాటలు చాలా డిఫరెంట్‌గా వుంటాయి.
మ్యూజికల్‌గా ఆడియో చాలా పెద్ద హిట్ అవుతుంది. నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో నటించారు. సత్యం రాజేష్ త్రో అవుట్ క్యారెక్టర్‌లో హీరో ఫ్రెండ్‌గా నటించాడు. అతను నటించిన సీన్స్ సూపర్బ్‌గా వచ్చాయి. మా శింబు సినీ ఆర్ట్స్ బేనర్‌లో 'కుర్రాడొచ్చాడు' తర్వాత రిలీజ్ అవుతున్న డైరెక్ట్ తెలుగు సినిమా ఇది. ఎంతో కేర్ తీసుకుని ప్రేక్షకులకి నచ్చేలా ఈ సినిమాని నిర్మించాం. 'మన్మథ', 'వల్లభ' చిత్రాల కంటే 'సరసుడు' బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెన్స్‌తో వున్నాం. మే 2న సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్ చేసి, మే మూడో వారంలో చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం'' అన్నారు.
శింబు, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ, సత్యం రాజేష్, సూరి, సంతానం, జయప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు, నిర్మాత: టి.రాజేందర్ ఎంఎ, సంగీతం: టి.ఆర్.కురళ్‌అరసన్, కెమెరా: బాలసుబ్రమణ్యం, ఎడిటింగ్: ప్రవీణ్-ప్రదీప్, ఆర్ట్: ప్రేమ్ నవాజ్, కొరియోగ్రఫీ: సతీష్, రచనా-సహకారం: బోస్ గోగినేని, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వెంకట్ కొమ్మినేని, కో-ప్రొడ్యూసర్: శ్రీమతి ఉషా రాజేందర్, నిర్మాత: టి.రాజేందర్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్