మీటూలో ఆరోపణలు ఎదుర్కొన్న శింబు
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాది విషయానికి వస్తే.. తమిళ చిత్ర పరిశ్రమలో మీ టూ ఉద్యమం జోరుగా ఉంది. ఇలాంటి తరుణంలో లేఖా వాషింగ్టన్ అనే నటి ఓ నటుడు తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె దక్షిణాదిలో చేసిన చిత్రం `కెట్టవన్` మాత్రమే. అందులో హీరో శింబు. సదరు నటి పేరు చెప్పలేదు కాబట్టి అందరూ చూపు ఇప్పుడు శింబుపైనే ఉంది. దర్శకుడు, శింబుకి మధ్య తలెత్తిన విబేదాల కారణంగా `కెట్టవన్` సినిమా విడుదల కాలేదు.
తాజాగా ఆరోపణలతో విడుదల సంగతేమో కానీ.. `కెట్టవన్` మరోసారి వార్తల్లో నిలిచింది. తమ హీరో ప్రతిష్ట దిగజార్చేలా లేఖా వాషింగటన్ వ్యాఖ్యలు చేసిందని శింబు అభిమానులు లేఖా వాషింగ్‌టన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా వస్తున్న కామెంట్స్‌పై కూడా మహిళలు ముందుకు వచ్చి స్పందించాలని లేఖా వాషింగ్‌టన్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com