విశాల్ పై కోర్టుకెక్కిన శింబు
- IndiaGlitz, [Thursday,January 10 2019]
తమిళ హీరో శింబు గతంలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో 'ఎఎఎ' అనే సినిమాలో నటించారు. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. శింబు జోక్యం వల్లే తాను నష్టపోయానని నిర్మాత వైుకేల్ రాయుప్పన్ నిర్మాతల మండలిని ఆశ్రయించారు. అందువల్ల నిర్మాతల మండలి వివరణ కోరుతూ శింబుకు నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో శింబు నిర్మాతల మండలినిపై, నిర్మాత వైుకేల్ రాయుప్పన్‌పై కోర్టులో కేసు వేశారు. తనకు పారితోషకంగా 8 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఐదు కోట్లే ఇచ్చారని.. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని శింబు పేర్కొన్నారు.
వాదనలు విన్న కోర్టు వైుకేల్ రాయుప్పన్‌ను పిటిషన్ వేయాల్సిందిగా కోరడమే కాకుండా.. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌కు లీగల్ నోటీసులు జారీ చేసింది. కేసును ఈ నెల 18కి వాయిదా వేశారు.