సిల్లీ ఫెలోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్
- IndiaGlitz, [Thursday,September 06 2018]
సునీల్,అల్లరి నరేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సిల్లీ ఫెలోస్'.. చిత్ర శుక్లా, నందిని రాయ్ లు హీరోయిన్లు గా నటిస్తున్న ఏ చిత్రానికి భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వం దర్శకత్వం వహించారు.. ఈ సినిమాలో బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, హేమా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా శ్రీ వసంత్ సంగీతం సమకూరుస్తున్నారు.. అనిష్ తరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నాడు.. బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్, LLP మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై కిరణ్ రెడ్డి మరియు భారత్ చౌదరి నిర్మిస్తుండగా,ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనం గా జరిగింది..కాగా ఈ కార్యక్రమానికి పలువురు సినిమా ప్రముఖులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.. ఈనెల 7 న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కాబోతుంది..
హీరోయిన్ నందిని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు భీమనేని గారికి చాలా అతనికి.. మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో చేసిన ఆ సినిమా అంటే చాల ఇష్టం.. మీ ఇతర సినిమాలు కూడా బాగానే చూసాను. అవి చాల ఇష్టం.. మా సిల్లీ ఫెలోస్ తో మీ అందరి ఎక్స్పెక్టషన్స్ అందుకుంటాము.. మా ప్రొడ్యూసర్స్ నన్ను ఎంకరేజింగ్ చేసినందుకు చాల థాంక్స్.. ఈ సినిమా ని చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ గా ఉండండి. .అన్నారు..
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేయడం చాల ఆనందంగా ఉంది.. ఈ సినిమాతో ముగ్గురు అద్భుతమైన ప్రొడ్యూసర్స్ ని కలిశాను. భీమనేని గారి తో సినిమా చేయడం ఒక పర్ఫెక్ట్ గా ఉంది.. అయన పర్ఫెక్ట్ గా ఉండడం వాళ్ళ నేను కొంచెం ఎక్కువ పనిచేయడం జరుగుతుంది.. రెగ్యులర్ గా కాకుండా ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి న సినిమా ఇది.. ఈ సినిమా కు నాకు సప్పోర్ట్ చేసిన నా రైటర్స్ కి, కీ బోర్డు ప్లేయర్స్ కి చాల థాంక్స్.. అన్నారు..
హీరోయిన్ చిత్ర శుక్లా మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.. ఈ సినిమాలో ఒక భాగమైనందుకు చాల గౌరవంగా ఉంది.. నేను ఒక చిన్న ఆర్టిస్ట్ ను.. అలాంటి ది టాలీవుడ్ లాంటి పెద్ద ఇండస్ట్రీ లో నుంచి పరిచయమవడం చాల ఆనందంగా ఉంది.. తెలుగులో మూడో సినిమా చేస్తున్నా.. ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్ కి చాల థాంక్స్.. గ్రేట్ యాక్టర్స్ తో పనిచేసాను.. వారితో పనిచేయడం చాల ఆనందంగా ఉంది.. వారినుంచి చాల నేర్చుకున్నాను. నరేష్ గారు, సునీల్ గారు .. మీతో పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు.. మీతో ఈ సినిమా చేయడం చాల హ్యాపీ గా ఉంది.. ఈ పాత్ర కు నన్ను ఎంచుకునేందుకు భీమనేని గారికి చాల థాంక్స్..అన్నారు..
కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించినందుకు చాల ఆనందంగా ఉంది.. భీమనేని శ్రీనివాసరావు గారితో నా అనుభందం 26 సంవత్సరాలు.. అప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి మార్పు ఆయనలో లేదు.. ఏదైనా సరే చాల పర్ఫెక్ట్ గా ఉండాలనుకునే కొద్దీ మంది డైరెక్టర్లలో ఒకరు అయన.. సినిమా ఎంతబాగా వచ్చిందో సినిమా ట్రైలర్,ప్రమోషన్ సాంగ్స్ చూస్తే తెలుస్తుంది.. ఈ సినిమాలో ఎవరికీ వారు తమ స్టయిల్లో నవ్వించారు.. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అనిపిస్తుంది.. కమెడియన్స్ ని బాగా ఎంకరేజ్ చేసి నాలుగు రోజులు బ్రతికించండి.. సినిమా చూసి నవ్వుకోండి.రిలాక్స్ అవ్వండి.. ఈ సినిమా హిట్ కావాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను..
దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి చేసిన అందరు టెక్నిషియన్స్, ఆర్టిస్ట్స్ చాల బాగా తెలుసు.. భీమనేని గారు వర్కింగ్ స్టైల్ చాల బాగా తెలుసు.. ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటుంది.. సునీల్, నరేష్ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా ఎంత ఫన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. కామెడీ కి రోల్ మోడల్స్ వారు.. ఈ సినిమా హిట్ అయ్యి ప్రొడ్యూసర్స్ కి మంచి డబ్బుకులొచ్చి ఇలాంటి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.. అన్నారు..
చిత్ర నిర్మాత భరత్ చౌదరి గారు మాట్లాడుతూ.. సింపుల్ గా చెప్పాలంటే రెండు గంటలు నవ్వుల్లో తేలాలంటే ఈ సినిమా చూడాలి.. మిగితా విషయాలు సక్సెస్ మీట్ లో మాట్లాడతాను అన్నారు..
వివేక్ కూచిభొట్ల గారు మాట్లాడుతూ.. ఈనెల 7 వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఇంత మంచి సినిమా ప్రేక్షకులను ఆదరించాలని కోరుకుంటున్నాను.. సినిమా అంత బాగా తీసిన భీమనేని గారు ఈ సినిమా తో మంచి హిట్ కొట్టబోతున్నారు.. సినిమాలో నటించిన ఆర్టిస్ట్ కి , టెక్నిషియన్స్ అల్ ది బెస్ట్..
హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ... అందరికి టీచర్స్ డే శుభాకాంక్షలు.. నా గురువు .. నా పేరు అల్లరి నరేష్ గా మార్చిన అల్లరి రవిబాబు కి టీచర్స్ డే శుభాకాంక్షలు.. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన అందరికి డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు టీచర్స్ డే శుభాకాంక్షలు.. భీమనేని గారు నాకు పెద్దన్నయ్య లాగా .. నా అన్ని సినిమాల్లో అయన కృషి తప్పక కనిపిస్తుంది.. ఏం చేసినా సరే మంచి జరగాలనే అయన నా వెన్నంటి ఉన్నారు.. సుడిగాడు తర్వాత మా కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను.. ఈ సినిమాలో సునీల్ గారు రావడం సినిమా కి ప్లస్.. నేను అయన తో చేసిన ఫస్ట్ సినిమాలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు.. సునీల్ గారు ఈ సినిమా ప్రాణం ఇచ్చారు.. ఎక్కడా ఇగోస్ లేకుండా సినిమా కోసం చాల కష్టపడి సినిమా చేసాం.. పాత నరేష్ , పాత సునీల్ సినిమాలు ఎలా ఉంటాయో అలా ఉంటుంది ఈ సినిమా.. ఆవిషయంలో గ్యారెంటీ ఇస్తాను.. ప్రొడ్యూసర్స్ మంచి హార్డ్ వర్క్ చేశారు.. ఈ సినిమా వారికి మంచి విజయం అందించాలని కోరుకుంటున్నాను.. హీరోయిన్స్ బాగా నటించారు.. ఈ సినిమాతో వారికి మంచి బ్రేక్ వస్తుంది.. అన్నారు..
హీరో సునీల్ మాట్లాడుతూ.. భీమనేని గారితో పనిచేయడం చాల ఆనందంగా ఉంది..నాకు చిన్నపుడు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఆయనతో పనిచేయడం చాల ఈజీ అయ్యింది.. అందరం హ్యాపీ గా shooting చేసాం.. నరేష్ గారితో సినిమా చేస్తుంటే చాల హ్యాపీ గా ఉంది.. ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది.. బ్రహ్మానందం గారిని రీప్లేస్ చేసే సత్తా ఎవరికీ లేదు అలా అనడం అయన మంచి తనం.. ఈ సినిమా తప్పక హిట్ కావాలని కోరుకుంటున్నా.. అన్నారు.
దర్శకుడు భమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా వెనక చాల కష్టం ఉంది..స్క్రిప్ట్ పై సంవత్సరం ఎఫర్ట్ పెట్టి ఆ తర్వాత షూటింగ్ చేసి చేసిన ఎంతో కష్టపడినా సినిమా ఇది.. సినిమా బాగా వచ్చిందని చెప్పడం కాదు మీరే థియేటర్ లో చూస్తారు.. నరేష్ తో ఇంతకుముందు సుడిగాడు సినిమా చేసాను.. ఆ సినిమా తర్వాత చాల సబ్జక్ట్స్ చూసాం.. చాల అనుకున్నాం... ఈసారి మంచి స్టోరీ తో రావాలని చేసిన సినిమా ఇది.. మన ఎఫర్ట్ కరెక్ట్ గా పెడితే చిన్న సినిమా , పెద్ద సినిమా అయినా హిట్ అవుతుంది.. సుడిగాడు లాంటి స్టోరీ ని ఊహించొద్దు.. అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ఇది.. పాటలు కూడా రెండే పెట్టాం.. స్పీడ్ బ్రేకర్స్ లా ఉండొద్దని... ఈ సినిమాతో సునీల్ గారు మళ్ళీ కమెడియన్ గా రావడం ఆనందంగా ఉంది.. హీరో తో ట్రావెల్ చేసే ఫుల్ లెంగ్త్ పాత్ర ఆయనది.. మా ప్రొడ్యూసర్స్ మంచి సపోర్ట్ ఇచ్చారు.. ఈ సినిమా తప్పక విజయం అవుతుందని నమ్మకం ఉంది.. అన్నారు..