Silk Smitha:సిల్క్ స్మిత బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల.. అదిరిపోయిందిగా..
Send us your feedback to audioarticles@vaarta.com
దివంగత నటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా మరో బయోపిక్ తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆమె జయంతిని పురస్కరించుకుని ‘సిల్క్ స్మిత- ది అన్‌టోల్డ్ స్టోరీ’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ సినీ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇందులో లీడ్ పాత్రలో నటించిన చంద్రికా రవి అచ్చం సిల్క్ స్మితలాగే కనిపించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మితమవుతున్న ఈ మూవీకి కొత్త దర్శకుడు జయరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో సిల్క్ స్మిత పాత్రను చంద్రికా రవి పోషిస్తున్నారు. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ మోడల్ అయిన చంద్రికా ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమాలోని ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే’ పాటలో ఆడిపాడారు. ఇదిలా ఉంటే సిల్క్ స్మిత జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా 2011లో ‘డర్టీ పిక్చర్’ అనే సినిమా వచ్చింది. ఇందులో విద్యా బాలన్ టైటిల్ రోల్ పోషించారు. ఈ సినిమా కొన్ని వివాదాలతో పాటు సూపర్ హిట్ కూడా అయ్యింది. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు మరో బయోపిక్ తెరకెక్కుతుంది. మరి ఈ చిత్రం ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.
కాగా భారతీయ సినిమా ఇండస్ట్రీలోని గొప్ప ఐటెం గర్ల్స్‌లో సిల్క్ స్మిత ఒకరిగా పేరు దక్కించుకున్నారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన స్మిత కైపెక్కించే మాటలు, మత్తెక్కించే చూపులతో అప్పటి యువతను ఉర్రూతలూగించారు. జ్యోతిలక్ష్మి, జయమాలిని తర్వాత అంతటి పేరు తెచ్చుకున్నారు. తమ సినిమాల్లో స్మిత ఆడిపాడితే చాలు అనుకునే వారు ఆ తరం హీరోలు. తన 19 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 450కి పైగా తెలుగు, తమిళ సినిమాల్లో నటించారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే చివరికి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ లోకాన్ని వీడి 27 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ ఆమెను ప్రేక్షకులు గుండెల్లో నిలిచిపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com