'సైలెన్స్ ప్లీజ్' మార్చి 8న

  • IndiaGlitz, [Thursday,March 07 2019]

బెంగళూర్ లోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని జీవితంలో జరిగిన ఓ సంఘటన స్ఫూర్తిగా తీసుకుని కన్నడలో రూపొంది ఘన విజయం సాధించిన థ్రిల్లర్ 'నిశ్శబ్ద-2'. ఈ చిత్రాన్ని తెలుగులో 'సైలెన్స్ ప్లీజ్' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో రూపేష్ శెట్టి, ఆరాధ్య శెట్టి హీరోహీరోయిన్లు. దేవరాజ్ కుమార్ దర్శకత్వం వహించారు. వల్లూరిపల్లి రమేష్ సమర్పణలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. మార్చి 8న, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

నిర్మాత- తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. 'స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి వారం ఏడెనిమిది సినిమాలకు తక్కువ కాకుండా రిలీజయ్యే ప్రస్తుత తరుణంలో.. ఈవారం కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే విడుదలవుతుండడం.. వాటిలో 'సైలెన్స్ ప్లీజ్' పెద్ద సినిమా కావడం కూడా కలిసి రానుంది. 'సైలెన్స్ ప్లీజ్' కచ్చితంగా సైలెంట్ హిట్ అవుతుందనే గట్టి నమ్మకం మా అందరిలోనూ ఉంది.. అన్నారు!!

More News

దారుణం: యశోదా ఆస్పత్రిలో రోగి కిడ్నీ మాయం

ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు.. ప్రాణాలు తీస్తున్నారు.. మరికొందరు తాము వైద్యులమనే విషయం మరిచి కాసులకు కక్కుర్తి పడి చిల్లరపనులు చేస్తున్నారు.

టాలీవుడ్ 'ముగ్గురు మిత్రులు' మళ్లీ కలిశారు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్, హీరో ప్రిన్స్, అక్కినేని యంగ్ హీరో అఖిల్ స్నేహితులన్న విషయం తెలిసిందే.

దిల్‌‌రాజుకు 'మే' సెంటిమెంట్ సరే.. మహేశ్ సంగతేంటి!?

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌‌ దిల్ రాజు‌‌కు ‘మే’ నెల బాగా కలిసొచ్చింది. అందుకే ఆయన తాను ప్రొడ్యూసర్‌‌గా చేసిన సినిమాలు రిలీజ్ అయితే

బీజేపీ ఎమ్మెల్యేను బూటుతో కొట్టిన ఎంపీ..

జడ్పీటీసీ సమావేశాలు మొదలుకుని అసెంబ్లీ సమావేశాల వరకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఏ రేంజ్‌‌లో విమర్శల వర్షం కురిపించుకుంటారో మనందరం చూసే ఉంటాం.

చంపేస్తారా? చంపేయండి.. చావడానికి రె‘ఢీ’!

టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేనిపై వైసీపీ, జనసేన కార్యకర్తలు కొందరు సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంతో రెండు వేర్వేరు కేసుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.