ఇద్దరు దొంగ వెధవల దారిద్రమైన కథే గుంటూర్ టాకీస్ - హీరో సిద్దూ

  • IndiaGlitz, [Monday,February 29 2016]

సిద్దూ, శ్ర‌ద్దా దాస్, రేష్మి, సీనియ‌ర్ న‌రేష్ ప్ర‌ధాన తార‌గ‌ణంగా రూపొందిన చిత్రం గుంటూర్ టాకీస్. ఈ చిత్రాన్ని ప్ర‌వీణ్ స‌త్తార్ తెర‌కెక్కించారు. వైవిధ్య‌మైన క‌ధాంశంతో రూపొందిన గుంటూర్ టాకీస్ చిత్రాన్ని మార్చి 4న రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా గుంటూర్ టాకీస్ హీరో సిద్దు తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...
మీ గురించి..
మా అమ్మ ఆల్ ఇండియా రేడియో మ్యూజిక్ డిపార్టెమెంట్ లో జాబ్ చేసేవారు. అమ్మ ప్ర‌భావం వ‌ల‌న నాకు కూడా మ్యూజిక్ పై ఇంట్ర‌స్ట్ ఏర్ప‌డింది. కానీ...సినిమాల్లోకి వ‌స్తాన‌ని అస‌లు అనుకోలేదు. నా ఫ్రెండ్ ద్వారా డైరెక్ట‌ర్ తాతినేని స‌త్య ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆయ‌న నాకు భీమిలి క‌బ‌డ్డీ జ‌ట్టు త‌మిళ వెర్షెన్ చూపించి అందులోని నెగిటివ్ రోల్ తెలుగులో చేసే అవ‌కాశం క‌ల్పించారు. ఆవిధంగా న‌టుడ‌య్యాను. ఆత‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ ఆరెంజ్ సినిమాలో జెనీలియా బాయ్ ఫ్రెండ్ క్యారెక్ట‌ర్ చేసాను. త‌మిళ ఫిల్మ్ ఒక‌టి చేసాను. డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తార్ ఎల్.బి.డ‌బ్ల్యూ సినిమాలో న‌టించాను. ఇప్పుడు గుంటూర్ టాకీస్ సినిమా ద్వారా హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాను.
గుంటూర్ టాకీస్ లో మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?
ఈ సినిమాలో స్ల‌మ్ లో ఉండే ప్లే బాయ్ క్యారెక్ట‌ర్ చేసాను. మెడిక‌ల్ షాపులో వ‌ర్క్ చేస్తూ చిల్ల‌ర దొంగ‌త‌నాలు చేస్తుంటాను. ఈ సినిమా గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే ఇద్ద‌రి దొంగ వెధ‌వ‌ల దారిద్ర‌మైన క‌థ ఈ గుంటూర్ టాకీస్. అలాంటి వాళ్ల లైఫ్ లో స‌డ‌న్ గా మార్పు వ‌స్తుంది. అది ఏమిట‌నేది తెర‌పైనే చూడాలి.
గుంటూర్ టాకీస్ టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏమిటి..?
ఈ సినిమా గుంటూర్ నేప‌ధ్యంతో జ‌రుగుతుంది. ఈ సినిమాలోని క్యారెక్ట‌ర్స్ లైఫ్ లో జ‌రిగేది సినిమాటిక్ గా ఉంటుంది కాబ‌ట్టి టైటిల్ గుంటూర్ టాకీస్ అని పెట్టాం.
సంగీతంలో ప్ర‌వేశం ఉంది అన్నారు క‌దా...మ‌రి..ఈ సినిమా మ్యూజిక్ కి ఏమైనా వ‌ర్క్ చేసారా..?
ఈ సినిమాలో ఒక పాట పాడాను. అలాగే పాట రాసాను కూడా. ఇంకో విష‌యం ఈ సినిమాకి క‌థ - మాట‌లు నేనే రాసాను. ఇక మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే...రీ రికార్డింగ్ సిట్టింగ్స్ లో పాల్గొని నా వంతు స‌హ‌కారాన్నిఅందించాను.
క‌థ మీరే రాసాను అంటున్నారు..అస‌లు ఈ క‌థ ఎలా పుట్టింది..?
ఎల్.బి.డ‌బ్ల్యూ సినిమాలో న‌టించినప్ప‌టి నుంచి ప్ర‌వీణ్ స‌త్తార్ బాగా ప‌రిచ‌యం. చంద‌మామక‌థ‌లు త‌ర్వాత ప్ర‌వీణ్ మాస్ మూవీ చేయాల‌నుకున్నారు. ఆ టైమ్ లో నేను స‌ర‌దా..చాలా సింపుల్ గా ఈ క‌థ రాసాను. ప్ర‌వీణ్ కి కూడా బాగా న‌చ్చ‌డంతో ఈ సినిమా స్టార్ట్ చేసాం.
రేష్మి తో చాలా హాట్ సాంగ్ చేసారు క‌దా...చేసేట‌ప్పుడు ఇబ్బందిగా ఫీల‌య్యారా..?
డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ హాట్ సాంగ్ ప్లాన్ చేసాన‌ని చెప్పారు. అయితే నేను చేయ‌లేని చెప్ప‌డంతో సాంగ్ క్యాన్సిల్ చేసేద్దాం అన్నారు. ఈ విష‌యాన్ని అమ్మ‌తో చెబితే ఆర్టిస్ట్ అయిన‌ప్పుడు ఏదైనా చేయాలి. నువ్వు ఇబ్బందిగా ఫీలైతే ముందు రేష్మితో ఫ్రెండ్లీగా ఉండు ఆత‌ర్వాత సాంగ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని స‌ల‌హా ఇచ్చింది. అమ్మ నుంచి అలాంటి ఆన్స‌ర్ అస‌లు ఊహించ‌లేదు. సాంగ్ కోసం అమ్మ చెప్పిన‌ట్టు రేష్మితో ఫ్రెండ్ షిప్ చేసి ఆత‌ర్వాత ఆ సాంగ్ చేసాం. నాకైతే సాంగ్ లో ఎక్క‌డా వ‌ల్గారిటీ లేదు.
గుంటూర్ టాకీస్ లో మిగిలిన పాత్ర‌లు గురించి..?
శ్ర‌ద్దాదాస్ లేడీ డాన్ గా న‌టించారు. ఆమె పాత్ర పేరు రివాల్వ‌ర్ రాణి. మ‌హేష్ మంజ్రేక‌ర్ కీల‌క పాత్ర పోషించారు. ఆయ‌న‌తో వ‌ర్క్ చేస్తున్నంత సేపు చాలా నేర్చుకున్నాను. అలాగే సీనియ‌ర్ న‌రేష్, ర‌ఘ‌బాబు త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌లు పోషించారు.
గుంటూర్ టాకీస్ లో సందేశం ఏమైనా ఉందా..?
సందేశం అంటూ ఏమీ లేదు. ఫ్రెండ్స్ తో క‌ల‌సి చూసి ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. ఒక కొత్త సినిమా చూసిన అనుభూతిని మా గుంటూర్ టాకీస్ క‌లిగిస్తుంది.