రెండవసారి లక్ పరీక్షించుకోనున్న సిద్ధార్థ్..
Send us your feedback to audioarticles@vaarta.com
బాయ్స్`, బొమ్మరిల్లు`, కొంచెం ఇష్టం-కొంచెం కష్టం` వంటి సినిమాలతో తెలుగులో మంచి విజయాలు అందుకున్న హీరో సిద్ధార్థ్. అయితే తరువాత అనుకున్న స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో సిద్ధార్థ్ తమిళ సినిమా రంగం వైపు దృష్టి సారించాడు. కావ్య తలైవన్, జిగర్ తండా, ఎనకుల్ ఒరువన్ వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నాడు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. ఎనకుల్ ఒరువన్ చిత్రాన్ని నాలో ఒకడు అనే టైటిల్ తో తెలుగులో విడుదల చేశాడు.
ప్రస్తుతం తమిళంలోనే జిల్ జంగ్ జక్ అనే టైటిల్ తో మరో సినిమాని నిర్మాతగా రూపొందిస్తున్నాడు. డార్క్ కామెడితో రూపొందిన ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుందట. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదట. ప్రముఖ సీనియర్ నటుడు రాధారవి కీలకపాత్రలో కనిపిస్తాడట. డిఫరెంట్ జోనర్ లో వస్తున్న ఈ మూవీతో నిర్మాతగా సక్సెస్ అవుతానని సిద్ధార్థ్ నమ్మకంగా ఉన్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com