సిద్దార్థ్ సినిమా వాయిదా పడింది
Send us your feedback to audioarticles@vaarta.com
శంకర్ రూపొందించిన బాయ్స్ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు సిద్దార్థ్. నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, బొమ్మరిల్లు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సిద్ధార్థ్.. ఆ తరువాత ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోయాడు. ఆ తరువాత కొన్ని వివాదాలతో తెలుగు సినిమాలకు దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. సిద్ధార్థ్ మళ్లీ తెలుగువారికి చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
అందులో భాగంగా.. ఓ హర్రర్ కథాంశంతో ఇక్కడివారిని పలకరించేందుకు సన్నాహాలు చేసుకున్నాడు. ఆ చిత్రమే గృహం. తమిళంలో అవళ్, హిందీలో ది హౌస్ నెక్ట్స్ డోర్ పేర్లతో ఈ చిత్రం విడుదల కానుంది. తమిళ్, హిందీ భాషల్లో రేపు విడుదల కానున్న ఈ సినిమా.. తెలుగులో కూడా రేపే విడుదల కావాల్సింది. అయితే.. ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరక్కపోవడం వల్లే ఈ సినిమాని వాయిదా వేశారని తెలిసింది.
నవంబర్ 10న గృహం విడుదల కాబోతుందని చిత్ర వర్గాలు ప్రకటించాయి. హర్రర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సిద్దార్థ్‌కి జోడీగా ఆండ్రియా నటించింది. మిలింద్ రావ్ దర్శకత్వం వహించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments