Siddharth-Adithi Rao: పెళ్లి వార్తలపై స్పందించిన సిద్దార్థ్, అదితిరావు.. ఏమన్నారంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నారు. అందుకు తగ్గట్లే వీరిద్దరూ కలిసి విహారయాత్రల్లో మునిగితేలుతున్నారు. అయితే ఇంతవరకు తమ ప్రేమ వ్యవహారం గురించి అధికారికంగా ఇంతవరకు ప్రకటించలేదు. కానీ బుధవారం వీరి పెళ్లి జరిగిందని వార్తలు వైరల్ అయ్యాయి. తెలంగాణలోని వనపర్తి శ్రీరంగపురం టెంపుల్‌లో వీరి వివాహం జరిగిందని ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు, వీడియోలు లీక్ అవ్వలేదు.
తాజాగా వీరిద్దరు తమ బంధాన్ని ఇన్‌స్ట్రాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇద్దరు తీసుకున్న సెల్ఫీ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె అంగీకారం తెలిపింది.. నిశ్చితార్థం జరిగింది అని సిద్దార్థ్ పోస్ట్ చేయగా.. అతడు అంగీకారం తెలిపాడు.. నిశ్చితార్థం జరిగింది అని అతిది పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో ఇద్దరూ కొత్త ఉంగరాలతో ఉన్నారు. దీంతో ఈ జంట కేవలం నిశ్చితార్థం చేసుకున్నారని, పెళ్లి కాదని క్లారిటీ వచ్చేసింది. మరి పెళ్లి ఎప్పుడూ చేసుకుంటారనేది మాత్రం వెల్లడించలేదు. దీంతో అభిమానులు, సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా ఇద్దరు కలిసి తొలిసారిగా అజయ్ భూపతివర్మ దర్శకత్వంలో 'మహాసముద్రం' అనే సినిమా చేశారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే సిద్దార్థ్‌కు గతంలోనే పెళ్లి జరిగింది. మేఘన అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి కొడుకు కూడా ఉన్నాడు. కానీ మనస్పర్థాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మనోడు సమంతతో పాటు ఒకరిద్దరు హీరోయిన్స్‌తో ప్రేమాయణం నడిపాడు. ఇక ఇప్పుడు అదితితో ప్రేమ వ్యవహారం నడిపి నిశ్చితార్థం చేసుకున్నాడు. అలాగే అదితికి కూడా ఇంతకు ముందే వివాహం అయింది. 2012లో భర్తతో విడాకులు తీసుకుంది. మొత్తానికి ఇన్నాళ్లు సీక్రెట్‌గా సాగిన వీరి ప్రేమ వ్యవహారం ఇప్పుడు ఓపెన్ అయింది.
ఇక సినిమాల విషయానికొస్తే సిద్దార్థ్ ఇటీవల 'చిన్నా' అనే సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. తమిళంలో కంటే తెలుగులోనే సిద్దార్థ్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట తదితర చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే తెలుగు అమ్మాయైన అదితిరావు.. చెలియా, సమ్మోహనం, వి, మహాసముద్రం వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments