సూపర్ స్టార్ మహేష్ ను కలిసిన సిద్ధాపురం గ్రామస్థులు
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ తాను నిజమైన శ్రీమంతుడు`గా నిరూపించుకున్నారు. ఆయన సిద్ధాపురం అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. తమ గ్రామాన్ని మహేష్ దత్తత తీసుకున్నందుకు ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఖాదర్ గోరి అధ్వర్యంలో గ్రామస్థులు సూపర్ స్టార్ మహేష్ ను కలిసి తమ ధన్యవాదాలను తెలియజేశారు.
గ్రామ సర్పంచ్ ఎర్రోజు నర్సమ్మ, ఎంపీటీసీ బాలయ్య సహా శివాజీ యూత్ సహా యువజన సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవం షూటింగ్ లో ఉన్న మహేష్ అందరినీ కలిసి వారితో అప్యాయంగా మాట్లాడారు. తమ గ్రామానికి మహేష్ ను రావాల్సిందిగా మహేష్ ను కోరారు. మహేష్ కూడా తప్పకుండా వస్తానని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com