Siddham:దద్దరిల్లిన రాప్తాడు 'సిద్ధం' సభ.. విషపురాతలకు తెరదీసిన ఎల్లోమీడియా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎటూ చూసినా జనమే.. ఎక్కడ విన్నా జగనే.. మండుంటెడను సైతం లెక్కచేయకుండా తమ అభిమాన నాయకుడి కోసం కిలోమీటర్ల మేర క్యూ కట్టిన జనప్రవాహం. అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన 'సిద్ధం' సభ సూపర్ హిట్ అయింది. ఊహించని దాని కంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంత జనాన్ని చూసి సీఎం జగన్ సైతం కొత్త ఉత్సాహంతో కనడపడ్డారు. ప్రసంగం ఆసాంతం అభిమానులను ఉర్రూతూలుగించే పంచ్‌లు, ప్రాసలతో క్యాడర్లో జోష్ నింపారు.
సీమబిడ్డకు జనం నీరాజనం..
సీఎం వైయస్ జగన్ పురిటిగడ్డ అయిన రాయలసీమలో జనం ఆయనకు నీరాజనం పట్టారు. సీమబిడ్డగా ఆయనకు ఉన్న ఇమేజ్ ఏంటో రాప్తాడు సభ మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. దాదాపు పది లక్షల మంది సభకు తరలివస్తే.. మరికొంతమంది రోడ్ల మీదే నిలబడిపోయారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇక సభలో జగన్ నోటి నుంచి వచ్చిన ప్రతి పదానికి జనం ఈలలతో కేరింతలు కొట్టారు. ముఖ్యంగా చంద్రబాబు పాలనపై విమర్శలు చేస్తున్నప్పుడు చప్పట్లతో తమ మద్దతు తెలియజేశారు. తన 14 ఏళ్ల పాలనలో ప్రజలను ఎలా మోసం చేశారో వివరిస్తుంటే ఊగిపోయారు.
వైసీపీ క్యాడర్లో ఎనలేని ఉత్సాహం..
ఈ సభలో జగన్ చేసిన ప్రసంగం రాష్ట్రంలోనే వైసీపీ క్యాడర్‌కు ఎనలేని ఉత్సాహం తీసుకొచ్చింది. రాబోయే ఎన్నికల్లో దుష్టచతుస్టయంతో చేసే కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం చేశాయి. చంద్రబాబుపై తన పంచ్లుతో నాయకుల నుంచి క్యాడర్ వరకు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు ఉరుకేలా చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి బహిరంగసభ జరగలేదంటే అతిశయోక్తి కాదు. ఈ సభకు వచ్చిన జనాన్ని చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రి అవ్వకుండ ఆపడం ఎవరి తరం కాదని విశ్లేషిస్తున్నారు. మరోవైపు టీడీపీ కూటమి నీరుగారిపోయింది.
ఎల్లోమీడియా అసత్యపు ప్రచారం..
దీంతో జగన్‌కు వస్తున్న విపరీతమైన ఆదరణ చూసి ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోంది. దీంతో రాప్తాడు సభకు జనమే రాలేదని చూపించేందుకు నానా తంటాలు పడుతోంది. ఫేక్ వీడియోలతో ప్రజలను మభ్యపట్టే ప్రయత్నం చేస్తోంది. జగన్‌ను చూసేందుకు జనమే రాలేదని.. ఇతర జిల్లాల నుంచి బలవంతంగా జనాన్ని బస్సుల్లో తరలించారని అసత్య ప్రచారానికి తెరదీసింది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎలా అసాధ్యమో... జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను పచ్చ మీడియా ద్వారా అడ్డుకోవడం అంతటి అసాధ్యం అని వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. పచ్చ నేతలు, పచ్చ మీడియా ఎంత తాపత్రయపడినా యాగాశ్వం మాదిరి దూసుకుపోతున్న తమ పార్టీని నిలువరించలేరని జగనన్న సైనికులు ఘంటాపథంగా చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments