ఇన్నేళ్ల తర్వాతే సిద్ధార్థ్‌కు తెలుగులో అలాంటి సినిమా వచ్చిందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
సిద్ధార్థ్‌కు తెలుగు సినీ ఇండస్ట్రీపై కోపం వచ్చిందా? ఆ కోపం తీరడానికి ఏడేళ్ల సమయం పట్టిందా? ఏమో పరిస్థితులను చూస్తే అలానే అనిపిస్తుంది. ఇంతకూ అలా అనిపించడానికి ఏమైనా ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా? వివరాల్లోకెళ్తే.. ఏడేళ్ల తర్వాత సిద్ధార్థ్ స్ట్రయిట్ తెలుగు సినిమా 'మహాసముద్రం'లో నటించబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఆర్.ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకుడు.
శంకర్ బాయ్స్ సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన సిద్ధార్థ్ తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ వచ్చాడు. ప్రారంభంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి భారీ హిట్‌ను సిద్ధార్థ్ దక్కించుకున్నాడు. తర్వాత చేసిన బొమ్మరిల్లు సిద్ధార్థ్ మార్కెట్‌ను అమాంతంగా పెంచేసింది. ఆ తర్వాత సిద్ధార్థ్ చేసిన చిత్రాల్లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా మినహా ఏ సినిమా కూడా ఆయనకు ఆశించిన మేరకు సక్సెస్‌ను అందించలేదు. 2013లో విడుదలైన జబర్దస్త్ సినిమానే హీరోగా సిద్ధార్థ్ తుది తెలుగు సినిమా. ఆ తర్వాత అదే ఏడాది ఎన్టీఆర్ బాద్షా సినిమాలో అతిథి పాత్రలో నటించాడు.
ఆ తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమాల్లో సిద్ధార్థ్ నటించనేలేదు. అన్నీ అనువాదం చిత్రాల్లోనే నటించారు. ఏవండీ ఎందుకు తెలుగు సినిమాలకు దూరమయ్యారు? అని ఎవరైనా అడిగితే బొమ్మరిల్లు తర్వాత నేను చేసిన సినిమా ఏదీ సక్సెస్ కాలేదు. అలాంటి మంచి కథ నా దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అనేవాడు. అలా దాదాపు ఏడేళ్ల వరకు తెలుగులో స్ట్రయిట్ మూవీ చేయలేదు సిద్ధార్థ్. ఇంత గ్యాప్ తర్వాత సిద్ధార్థ్‌కు అలాంటి కథ 'మహాసముద్రం' రూపంలో దొరికిందేమో, నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లున్నాడు మరి. మరి దీని తర్వాత అయినా సిద్ధార్థ్ వరుస తెలుగు సినిమాల్లో నటిస్తారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments