పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాల్లో ఓ మోస్తారు రాణించిన నటీనటులు చాలా వరకు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని తహతహలాడుతుంటారు. ఇప్పటికే పలువురు సీనియర్లు, జూనియర్స్ సినిమాలు పూర్తి చేసి రాజకీయాల్లోకి వచ్చారు. మరికొందరు అటు సినిమాలు.. ఇటు రాజకీయాలు రెండు బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. కోలీవుడ్‌లో ఇలా సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఎక్కువ మంది వస్తుంటారు. అయితే వీరిలో చాలా మంది సక్సెస్ అయ్యారు.. మరికొంత మంది ఇప్పటికే ఎంట్రీ ఇచ్చారు.. ఇంకొందరు ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. యంగ్ హీరో సిద్ధార్థ్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నాడని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఓ ప్రముఖ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయ్.
నాకంత సీన్లేదండోయ్!
అయితే ఈ వార్తలు.. ఆ నోటా.. ఈ నోటా పడి సిద్ధార్థ్ దాకా చేరడంతో ఎట్టకేలకు ఈ వ్యవహారంపై స్పందించి క్లారిటీ ఇచ్చుకున్నాడు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అబ్బే తనకు అంత సీన్లేదని స్పష్టం చేశాడు. ‘రాజకీయ నాయకుడిని కావాలనే ఉద్దేశం నాకు లేదు. నాలా మాట్లాడేవాళ్లు రాజకీయాల్లో ఉండలేరు. రాజకీయాల్లోకి రావాలంటే చాలా విషయాలు తెలిసుండాలి. అంతేకాదు.. ఏ విషయాన్ని ఎక్కడ మాట్లాడాలో తెలియాలి. సరైన సమయంలో సరైన విషయాన్ని ప్రస్తావించడం తెలిసుండాలి. నాకు నిజం మాట్లాడడం మాత్రమే తెలుసు’ అని ఆయన క్లారిటీ ఇచ్చుకున్నాడు. అయితే.. ప్రజా సమస్యలపై నాయకులు స్పందించకపోతే తప్పు చేసినట్టేనని తాను భావిస్తానన్నారు. మొత్తానికి చూస్తే పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న రూమర్స్‌కు సిద్ధార్థ్ తెరదించేశాడన్న మాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com