పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్

  • IndiaGlitz, [Sunday,December 29 2019]

సినిమాల్లో ఓ మోస్తారు రాణించిన నటీనటులు చాలా వరకు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని తహతహలాడుతుంటారు. ఇప్పటికే పలువురు సీనియర్లు, జూనియర్స్‌ సినిమాలు పూర్తి చేసి రాజకీయాల్లోకి వచ్చారు. మరికొందరు అటు సినిమాలు.. ఇటు రాజకీయాలు రెండు బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. కోలీవుడ్‌లో ఇలా సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఎక్కువ మంది వస్తుంటారు. అయితే వీరిలో చాలా మంది సక్సెస్ అయ్యారు.. మరికొంత మంది ఇప్పటికే ఎంట్రీ ఇచ్చారు.. ఇంకొందరు ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. యంగ్ హీరో సిద్ధార్థ్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నాడని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఓ ప్రముఖ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయ్.

నాకంత సీన్లేదండోయ్!
అయితే ఈ వార్తలు.. ఆ నోటా.. ఈ నోటా పడి సిద్ధార్థ్ దాకా చేరడంతో ఎట్టకేలకు ఈ వ్యవహారంపై స్పందించి క్లారిటీ ఇచ్చుకున్నాడు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అబ్బే తనకు అంత సీన్లేదని స్పష్టం చేశాడు. ‘రాజకీయ నాయకుడిని కావాలనే ఉద్దేశం నాకు లేదు. నాలా మాట్లాడేవాళ్లు రాజకీయాల్లో ఉండలేరు. రాజకీయాల్లోకి రావాలంటే చాలా విషయాలు తెలిసుండాలి. అంతేకాదు.. ఏ విషయాన్ని ఎక్కడ మాట్లాడాలో తెలియాలి. సరైన సమయంలో సరైన విషయాన్ని ప్రస్తావించడం తెలిసుండాలి. నాకు నిజం మాట్లాడడం మాత్రమే తెలుసు’ అని ఆయన క్లారిటీ ఇచ్చుకున్నాడు. అయితే.. ప్రజా సమస్యలపై నాయకులు స్పందించకపోతే తప్పు చేసినట్టేనని తాను భావిస్తానన్నారు. మొత్తానికి చూస్తే పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న రూమర్స్‌కు సిద్ధార్థ్ తెరదించేశాడన్న మాట.

More News

నాగ్ స్టంట్స్‌ కోసం హాలీవుడ్ నుంచి ఫైట్ మాస్టర్ వచ్చాడు!

టాలీవుడ్ కింగ్ నాగార్జున అప్ కమింగ్ మూవీ టైటిల్ ఖారరైంది. ‘వైల్డ్ డాగ్’ అనే ఆసక్తికరమైన పేరును పెట్టారు. కొత్తదనాన్ని పరిచయడంలో ముందుండే నాగ్.. ఈసారి ప్రేక్షకులకు థ్రిల్ పంచేందుకు సిద్ధమవుతున్నాడని

రాజధాని మార్పుతో లబోదిబోమంటున్న టాలీవుడ్ పెద్ద హీరో!

అమరావతి.. ఏపీ రాజధానిగా ఓ వెలుగు వెలిగింది. నిత్యం నిర్మాణాలతో.. వాటి సరంజామాతో హడావుడిగా కనిపించేది. అమాత్యుల నుంచి అధికారుల వరకు.. వీఐపీల నుంచి సామాన్యుడి వరకు కోలాహలంగా ఉండేది.

‘పవన్ కల్యాణ్ చతికిలపడ్డాడు.. హరీశ్ రావు ప్రయత్నాలు’..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీపీఎం నేత రాఘవులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్-బీజేపీ సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ కామెంట్స్ చేశారు.

విజయ్ సినిమాను భారీ మొత్తంలో సొంతం చేసుకున్న తెలుగు నిర్మాత

ఒకప్పుడు సూర్య, విక్రమ్ లాంటి కోలీవుడ్ హీరోలకు తెలుగులో మంచి మార్కెట్ ఉండేది. గజినీతో సూర్య, అపరిచితుడుతో విక్రమ్... తమ మార్కెట్‌ను అమాంతం పెంచేసుకున్నారు.

రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న రానా

రానా దగ్గుబాటి.. పర్ఫెక్షన్ కోసం ఆరాటపడే నటుడు. పాత్రకు తగ్గట్టుగా తనను తాను మలుచుకోవడానికి తాపత్రయ పడుతుంటాడు. బాహుబలి సినిమానే దీనికి పెద్ద ఉదాహరణ. ఆ సినిమాలో భల్లాలదేవ పాత్ర కోసం పూర్తిగా...