ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన పెద్దమ్మ శ్యామల!
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ ఇండస్ట్రీ మొత్తమ్మీద బాలీవుడ్లో సల్మాన్ ఖాన్.. టాలీవుడ్లో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ పేరు ఎక్కువగా వినపడుతుంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లి వ్యవహారంపై వార్తలన్నీ పుకార్లుగానే నిలుస్తున్నాయే తప్ప పెళ్లి పీటల వరకు మాత్రం వెళ్లట్లేదు. అదుగో పెళ్లి.. ఇదుగో పెళ్లి అని అంటున్నారే తప్ప జరిగేందేమీ లేదు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని కోట్లాది మంది అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇప్పటికే అమ్మాయిని చూశారని.. అమెరికా అమ్మాయని త్వరలోనే పెళ్లి ఉంటుందని ఇలా అటు సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ఈ క్రమంలో ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి (కృష్ణంరాజు సతీమణి) క్లారిటీ ఇచ్చేశారు.
ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులతో పాటు తాము కూడా ఎంతగానో వేచి చూస్తున్నామని శ్యామలా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. పెళ్లిపై వార్తలు వచ్చినప్పుడల్లా వాటిని చదివి మేమంతా నవ్వుకుంటామన్నారు. తమది చాలా పెద్ద కుటుంబం అని.. అందరితో కలిసిమెలిసి ఉండే అమ్మాయి కావాలన్నారు. అమ్మాయి కోసం వెతుకుతున్నామని.. దొరగ్గానే పెళ్లి చేస్తామన్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘జాన్’ మూవీ పూర్తై రిలీజ్ అవ్వగానే పెళ్లి ఉంటుందని శ్యామల స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే.. డార్లింగ్ పెళ్లిపై పెద్దమ్మ క్లారిటీ ఇచ్చేశారన్న మాట. ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments