బాలీవుడ్‌లోకి నాని శ్యామ్ సింగరాయ్ .... నిర్మాత ఎవరంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్వకత్వంలో తెరకెక్కిన సినిమా శ్యామ్ సింగరాయ్. నాని సరసన మడోన్నా సెబాస్టియన్, సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్‌లుగా నటించారు. గత వారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే 20 కోట్ల షేర్ వసూలు చేసి నానికి మంచి బూస్ట్ ఇచ్చింది. ఏపీలో ప్రస్తుతం థియేటర్ల మూసివేత, టికెట్ ధరల తగ్గింపు వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతున్నాడు శ్యామ్ సింగరాయ్.
ఇదిలావుంటే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలను బాలీవుడ్ పెద్దలు రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పుడు వారి చూపు ‘శ్యామ్ సింగరాయ్’’ మీద పడింది. ఇప్పటికే నాని నటించిన జెర్సీ అక్కడ విడుదలకు సిద్ధమైంది. దిల్‌రాజు- అల్లు అరవింద్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. తాజాగా శ్యామ్ సింగరాయ్ హిందీ రీమేక్‌ను కూడా దిల్‌రాజే నిర్వహించే అవకాశం లేకపోలేదు. శ్యామ్ సింగరాయ్‌ను నైజాంలో దిల్ రాజే స్వయంగా రిలీజ్ చేశారు. ఇక్కడ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి.
అటు ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేసిన సాయి పల్లవి కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం వుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మలయాళం, తెలుగు, తమిళ్‌లలో నటించిన సాయి పల్లవి తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమాతో కన్నడలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఎంట్రీ గురించి అడగగా… హిందీ చిత్రాల్లో నటించడానికి తాను సిద్ధమేనన్నారు. అయితే సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు సాయి పల్లవి తెలిపారు. పాత్ర బావుండాలి, బలమైన పాత్ర ఉంటే హిందీలో చేయడానికి సిద్ధం అన్నట్లు సంకేతాలిచ్చింది రౌడీ బేబీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com