త్రిశూలాల మధ్యలో నాని.. 'శ్యామ్ సింగ రాయ్' ఫైనల్ షెడ్యూల్

  • IndiaGlitz, [Thursday,July 01 2021]

నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీశ్ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. థియేటర్లు తెరుచుకోగానే ఆ చిత్రం రిలీజ్ కానుంది. ఈ లోపు నాని మరో క్రేజీ చిత్రాన్ని కూడా ఫినిష్ చేయనున్నాడు. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని 'శ్యామ్ సింగ రాయ్' లో నటిస్తున్నాడు.

బలమైన కథ, భారీ బడ్జెట్ తో రాహుల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. హైదరాబాద్ లో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మాతలు ఓ సెట్ నిర్మించారు. కీలక సన్నివేశాలు ఈ సెట్ లో ఉండబోతున్నాయి. ఆ మధ్యన వర్షాలకు సెట్ దెబ్బతినింది. మరమ్మతులు చేసి ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ ని అదే సెట్ లో షూట్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: దుబ్బాకలో హృదయ విదారక ఘటన.. ఆపద్భాంధవుడైన సంపూర్ణేష్ బాబు

10 ఎకరాల విస్తీరణంలో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో ఈ సెట్ నిర్మించారు. నేడు ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం కావడంతో చిత్ర యూనిట్ నాని ఇంట్రెస్టింగ్ స్టిల్ రిలీజ్ చేసింది. ఈ స్టిల్ లో నాని త్రిశూలాల మధ్య ఉండడం ఆసక్తికరంగా ఉంది.

ఈ చిత్రం కోల్ కతా నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ మూవీ లో నాని వివిధ గెటప్పుల్లో కనిపించబోతున్నట్లు టాక్. నాని సరసన హీరోయిన్లుగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ నటిస్తున్నారు.

మిక్కిజె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.

More News

న్యూడ్ పార్టీలు, సెక్సువల్ రిలేషన్ షిప్స్.. బిల్ గేట్స్ అసలు రంగు ఇదే!

గత నెలలో తామిద్దరం విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్,

కరోనా ఎక్కువగా ఉన్నప్పుడు సెలవు పెట్టమని చెప్పా.. కానీ నా భర్త..

హీరోయిన్ సంజన గల్రాని గత ఏడాది లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకుంది.

దుబ్బాకలో హృదయ విదారక ఘటన.. ఆపద్భాంధవుడైన సంపూర్ణేష్ బాబు

నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు.. తన సేవ కార్యక్రమాలు, పెద్ద మనసుతో అభిమానుల హృదయాల్లో స్థానం దక్కించుకుంటున్నాడు.

పిక్ టాక్: బికినీ ఫోజుతో నెట్టింట తుఫాన్ సృష్టించిన బాలయ్య హీరోయిన్

అందం ఉన్నప్పటికీ అదృష్టం కలసిరాని హీరోయిన్ సోనాల్ చౌహన్. ఎందుకనో దర్శకులు ఆమెని పెద్దగా కన్సిడర్ చేయడం లేదు.

అభిమానుల్లో మొదలైన అసహనం.. ఇప్పుడు వెంకటేష్, తర్వాత ఎవరో!

కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కుదిపేసింది. ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపింది. అన్ని రంగాలు కరోనా ఎఫెక్ట్ తో విలవిలలాడాయి.