'షీ'గా శ్వేత మీనన్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ శ్వేత మీనన్ (రాజన్న ఫేం) తెలుగులో 'షీ'గా రాబోతోంది. కల్వకుంట్ల తేజేశ్వర్ రావు (కన్నారావు) నిర్మాతగా మహేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'షీ' (ఈజ్ వెయిటింగ్). ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శ్వేత మీనన్ పై తాజాగా ఫోటోషూట్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వర్ రావు (కన్నారావు) మాట్లాడుతూ.. 'అతి త్వరలో ఒక మంచి సేవా కార్యక్రమంతో ఈ చిత్రాన్ని భారీగా ప్రారంభిస్తామని తెలిపారు. నవంబర్, డిసెంబర్ కల్లా చిత్ర షూటింగ్ పూర్తి చేసి మార్చిలో సినిమాను విడుదల చేస్తామన్నారు.
సినిమాలో హీరోతో పాటు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తెలిపారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - పర్స రమేష్ మహేంద్ర , నిర్మాత: కల్వకుంట్ల తేజేశ్వర్ రావు (కన్నారావు)
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments