పుకార్లకు క్లారిటీతో చెక్ పెట్టిన శృతిహాసన్
Send us your feedback to audioarticles@vaarta.com
రీసెంట్‌గా శ్రుతి హాసన్ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. దాని తర్వాత శ్రుతి హాసన్ దక్షిణాది సినిమాలను తక్కువగా మాట్లాడిందంటూ వార్తలు వినిపించాయి. దీనిపై శ్రుతిహాసన్ క్లారిటీ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తాను చెప్పని మాటలను కొందరు తెలుగు మీడియా పబ్లికేషన్స్ పనిగట్టుకుని తప్పుగా వక్రీకరించారని శ్రుతి హాసన్ తెలియజేసింది. తెలుగులో తాను రేసుగుర్రం, గబ్బర్‌సింగ్ చిత్రాల్లో నటించడంపై గర్వంగా ఉందని, గబ్బర్ సింగ్ ఓ లైఫ్ ఛేంజింగ్ మూవీగా భావిస్తున్నానని శ్రుతి తెలిపారు.
రెండేళ్ళ క్రితం వరకు స్టార్ హీరోయిన్ హోదాలో ఓ వెలుగు వెలిగిన కథానాయిక శృతి హాసన్. కాని గత ఏడాది కాలం నుంచి ఈమె నటించిన ఒక్క సినిమా కూడా దక్షిణాదిలో విడుదల కాలేదు. తమిళంలో ‘ఎస్3’, తెలుగులో ‘కాటమరాయుడు’ సినిమాల తర్వాత శృతి.. దక్షిణాదిన దాదాపు కనుమరుగైపోయారు. ఈ క్రమంలో ఆమె ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్టు, అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు కథనాలు వినిపించాయి. లవ్ బ్రేకప్ కావడంతో శృతిహాసన్ మళ్లీ సినిమాలు, మ్యూజిక్ కాన్‌సర్ట్‌లపై ఫోకస్ చేసింది. ఆ క్రమంలో ఈమె రెండు తెలుగు సినిమాలకు ఓకే చెప్పింది. అందులో ఒకటి ‘క్రాక్’ సినిమా కాగా.. మరో చిత్రం పవన్‌కల్యాణ్ ‘వకీల్‌సాబ్’.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com