సుప్రీమ్ లో పటాస్ హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచిన చిత్రం పటాస్. ఈ చిత్రం ద్వారా అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ హీరోగా సుప్రీమ్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో తేజు సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర కోసం పటాస్ హీరోయిన్ శృతి సోదిని ఎంపిక చేసాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. ముఖ్యపాత్రతో పాటు హీరో సాయిథరమ్ తేజ్ తో ఓ పాటలో స్టెప్స్ కూడా వేస్తుందట శృతి. ఇక శృతి పాత్ర విషయానికి వస్తే....హీరోయిన్ అవ్వాలనుకునే అమ్మాయి పాత్రను శృతి సోది పోషిస్తున్నట్టు సమాచారం. ఫిబ్రవరిలో జరిగే షెడ్యూల్ లో శృతి పై సీన్స్ చిత్రీకరించనున్నారు. సుప్రీమ్ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com