అది ఓ అద్భుతమైన ఫీలింగ్ అంటున్న శృతి
Send us your feedback to audioarticles@vaarta.com
కమల్ హాసన్ నటిస్తున్న త్రిభాషా చిత్రం శభాష్ నాయుడు. ఈ చిత్రంలో కమల్ హాసన్ బలరామ్ నాయుడు గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ భార్యగా రమ్యకృష్ణ నటిస్తుండగా... కమల్ కుమార్తెగా రియల్ డాటర్ శృతిహాసన్ నటిస్తుండడం విశేషం. ఇక కమల్ హాసన్ కి పక్కన ఉండే అసిస్టెంట్ గా బ్రహ్మానందం నటిస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలతో రూపొందుతున్న ఈ క్రేజీ మూవీకి టి.కె.రాజీవ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
రాజకమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రూపొందే ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ క్రేజీ మూవీ షూటింగ్ ను ఇటీవల అమెరికాలో ప్రారంభించారు. ప్రస్తుతం కమల్ హాసన్, శృతిహాసన్ లపై కొన్నికీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా శృతి హాసన్ ట్విట్టర్ లో స్పందిస్తూ...నాన్నతో కలిసి వర్క్ చేయడం నాకు మరింత ఉత్సాహన్ని ఇచ్చింది. శభాష్ నాయుడు ఫస్ట్ డే షూటింగ్లో పాల్గొనడం అనేది ఓ అద్భుతమైన ఫీలింగ్ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments