'సంఘమిత్ర' కోసం శృతిహాసన్ కష్టం...
Wednesday, April 19, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
జయం రవి, ఆర్య, శృతిహాసన్ ప్రధాన తారాగణంగా ప్రముఖ నటి ఖుష్బూ భర్త, ప్రముఖ దర్శకుడు సుందర్.సి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `సంఘమిత్ర`. 150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. జయం వరి, ఆర్యలు ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించేశారు.
ఇక చెన్నై సొగసరి శృతిహాసన్ ఈ సినిమా కోసం కత్తి పట్టి కుస్తీ పడుతుంది. లండన్‌లో టిమ్ క్లోజ్ అనే మాస్టర్ దగ్గర శృతిహాసన్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ట్రయినింగ్ తీసుకుంటుంది. భారీ బడ్జెట్‌తో, భారీ సెట్టింగ్స్, తారాగణంతో రూపొందనున్న ఈ చిత్రం కోసం అందరూ బాగానే కష్టపడుతున్నారు. శృతి ఈ విషయాన్న తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. శృతిహాసన్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments