శృతి హాసన్‌కి మరో బంపరాఫర్.. చిరు పక్కన ఛాన్స్, స్వయంగా అనౌన్స్ చేసిన మెగాస్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ నటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తన అందం, నటనతో దూసుకెళ్తున్నారు. మధ్యలో కొంచెం స్లో అయినా ఇటీవలి కాలంలో మళ్లీ పుంజుకున్నారు. వరుసపెట్టి మంచి ప్రాజెక్ట్‌ల్లో ఆఫర్లు అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ చెన్నై సుందరికి బంపరాఫర్ తగిలింది. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్ ఎంపికయ్యారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. తన నివాసంలో శృతిహాసన్‌కు పుష్పగుచ్చం అందించిన ఫోటోను చిరు ట్వీట్ చేశారు. అలాగే దర్శకుడు బాబీ కూడా శృతిహాసన్‌కి వెల్‌కమ్ చెప్పారు. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ‘‘MEGA 154’’ని నిర్మిస్తోంది. ఇందులో చిరంజీవి ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నారు. 'వాల్తేరు వీరయ్య' టైటిల్ పరిశీలనలో ఉండగా.. దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.
మరోవైపు నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK107 సినిమాలో కూడా శృతి హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. 'బలుపు', 'క్రాక్' తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతి నటిస్తోన్న మూడో చిత్రమిది. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్‌గా, ఫ్యాక్షనిస్ట్ రెండు డిఫరెంట్ షేడ్స్ వున్న పాత్రలు పోషిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా టాక్. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments