శ్రుతి హాసన్‌కు గోల్డెన్ ఛాన్స్.. ప్రభాస్‌తో జోడీ కడుతోంది
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాది, ఉత్తరాది సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన గ్లామర్ డాల్ శ్రుతిహాసన్ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు మైకేల్‌తో ప్రేమ పాటలు వల్లించింది. ఆ క్రమంలో కెరీర్‌ను పట్టించుకోవడం మానేసింది. దాంతో సినీ పరిశ్రమ కూడా శ్రుతిహాసన్‌ను పక్కన పెట్టేసింది. ఆ తర్వాత శ్రుతిహాసన్ లవ్ బ్రేకప్ కావడంతో మళ్లీ తన మ్యూజిక్ కాన్‌సర్ట్స్, సినిమాలపై ఫోకస్ పెట్టింది. నెమ్మదిగా అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటోంది. ఈ తరుణంలో ఈ సంక్రాంతికి విడుదలైన క్రాక్ సినిమాతో భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు ఈ అమ్మడుకి ఓ గోల్డెన్ ఆపర్చునిటీ దక్కిందట. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జోడీగా శ్రుతిహాసన్ నటించనుందట. అది కూడా క్రేజీ ప్యాన్ ఇండియా మూవీ 'సలార్'. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో హోంబలే ఫిలింస్ బ్యానర్‌లో 'సలార్' సినిమా రీసెంట్‌గా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నుండి షూటింగ్ ప్రాంభం కానుంది.
కాగా.. ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్‌గా దిశా పటాని పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి కూడా. ఇప్పుడు ఈ క్రమంలో శ్రుతిహాసన్ పేరు కూడా పరిశీలనలో ఉంది. దాదాపు ఆమెనే కన్‌ఫర్మ్ అయ్యే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రభాస్ నాలుగు నెలల పాటు ‘సలార్’ కోసం డేట్స్‌ను కేటాయించాడట. మే చివరి నాటికంతా ‘సలార్’ షూటింగ్‌ను పూర్తి చేసేలా యూనిట్ ప్లాన్ చేసిందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments