శ్రుతి హాసన్‌కు గోల్డెన్‌ ఛాన్స్‌.. ప్రభాస్‌తో జోడీ కడుతోంది

  • IndiaGlitz, [Monday,January 25 2021]

దక్షిణాది, ఉత్తరాది సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన గ్లామర్‌ డాల్‌ శ్రుతిహాసన్‌ కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు మైకేల్‌తో ప్రేమ పాటలు వల్లించింది. ఆ క్రమంలో కెరీర్‌ను పట్టించుకోవడం మానేసింది. దాంతో సినీ పరిశ్రమ కూడా శ్రుతిహాసన్‌ను పక్కన పెట్టేసింది. ఆ తర్వాత శ్రుతిహాసన్‌ లవ్‌ బ్రేకప్‌ కావడంతో మళ్లీ తన మ్యూజిక్‌ కాన్‌సర్ట్స్‌, సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. నెమ్మదిగా అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటోంది. ఈ తరుణంలో ఈ సంక్రాంతికి విడుదలైన క్రాక్‌ సినిమాతో భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు ఈ అమ్మడుకి ఓ గోల్డెన్‌ ఆపర్చునిటీ దక్కిందట. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ జోడీగా శ్రుతిహాసన్‌ నటించనుందట. అది కూడా క్రేజీ ప్యాన్‌ ఇండియా మూవీ 'సలార్‌'. ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌లో 'సలార్‌' సినిమా రీసెంట్‌గా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నుండి షూటింగ్‌ ప్రాంభం కానుంది.

కాగా.. ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్‌గా దిశా పటాని పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి కూడా. ఇప్పుడు ఈ క్రమంలో శ్రుతిహాసన్‌ పేరు కూడా పరిశీలనలో ఉంది. దాదాపు ఆమెనే కన్‌ఫర్మ్‌ అయ్యే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై చిత్ర యూనిట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్ర‌భాస్‌ నాలుగు నెలల పాటు ‘సలార్’ కోసం డేట్స్‌ను కేటాయించాడట. మే చివరి నాటికంతా ‘సలార్’ షూటింగ్‌ను పూర్తి చేసేలా యూనిట్ ప్లాన్ చేసిందట.

More News

సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న స్థానిక ఎన్నికలు.. హైకోర్టులో మరో పిటిషన్..

ఏపీలో స్థానిక సమరమేమో కానీ.. అంతకు మించిన సమరం ఎన్నికలకు ముందే జరుగుతోంది.

'సర్కారువారి పాట' షూటింగ్‌ షురూ

సూపర్‌స్టార్‌ మహేశ్‌, పరుశురామ్‌ కాంబినేషన్‌లో రూపొందతున్న చిత్రం 'సర్కారు వారి పాట'.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జీ5 ఓటీటీలో 'సోలో బ్రతుకే సో బెటర్', 'అమృతం ద్వితీయం' కొత్త ఎపిసోడ్లు విడుదల

తెలుగు ప్రజలకు వినోదం అందించడమే లక్ష్యంగా ప్రతి వారం, ప్రతి నెల సరికొత్త ఒరిజినల్ వెబ్ సిరీస్ లు, డైరెక్ట్ టు డిజిటల్ రిలీజ్ సినిమాలు విడుదల

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతోన్న 'గాలిసంప‌త్' మార్చి 11న విడుద‌ల‌

బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్ఫ‌ణ‌లో రూపొందుతోన్నచిత్రం 'గాలి సంప‌త్`. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించడంతో

గుంటూరులో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఆశా వర్కర్ మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఆశావర్కర్ ఆదివారం మృతి చెందారు.