షూటింగ్‌కి సడెన్‌గా ప్యాకప్ చెప్పి వెళ్లిపోయిన శ్రుతిహాసన్..
Send us your feedback to audioarticles@vaarta.com
అగ్రహీరో కమల్‌హాసన్ కుమార్తెగా వెండితెరకు పరిచయమైనప్పటికీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి నటిగా శ్రుతిహాసన్ సొంత గుర్తింపును సంపాదించుకోగలిగింది. కాగా.. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన సినీ ఇండస్ట్రీ.. తాజాగా తిరిగి ప్రారంభించుకుంటోంది. ఈ క్రమంలోనే శ్రుతి హాసన్ తిరిగి షూటింగ్‌ల్లో పాల్గొంటోంది. అయితే తాజాగా శ్రుతి ఓ సినిమా షూటింగ్ నుంచి మధ్యలోనే ప్యాకప్ చెప్పి వెళ్లిపోయింది. దీనికి గల కారణాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంది.
విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా ‘లాభం’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. తాజాగా క్లైమాక్స్ సన్నివేశాలను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఈ షూటింగ్‌కు శ్రుతి హాజరైంది. ఈ సినిమా ఓ గ్రామీణ ప్రాంతానికి దగ్గరగా షూటింగ్ జరుగుతుండటంతో.. షూటింగ్ చూడ్డానికి పరిసర ప్రాంతాల ప్రజలు తండోపతండాలుగా వచ్చారట. దీంతో కరోనా భయంతో శ్రుతి షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయిందట. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది.
కోవిడ్ సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా చిత్రీకరణ ఎలా చేస్తున్నారంటూ యూనిట్‌పై శ్రుతి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. చిత్ర యూనిట్ తగు జాగ్రత్తలు తీసుకోకుంటే తన గురించి తాను జాగ్రత్తలు తీసుకునే హక్కు ఉందని ఆమె వెల్లడించింది. ‘‘కోవిడ్-19 వల్ల ప్రతిఒక్కరి ఆరోగ్యానికి ప్రమాదం ఉంది. ఈ మహమ్మారి ఇంకా అంతరించిపోలేదు. కరోనా ప్రోటోకాల్స్ పాటించని పక్షంలో.. ఓ వ్యక్తిగా, నటిగా నా భద్రత కోసం జాగ్రత్తలు తీసుకునే హక్కు నాకు ఉంది’’ అని శ్రుతి ట్వీట్‌లో పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments