ఆ హీరో కోసం సాంగ్ ను సింగేసింది
Send us your feedback to audioarticles@vaarta.com
సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో వరుస అవకాశాలతో కమల్ పెద్ద తనయ శృతిహాసన్ బిజీగా ఉంది. కేవలం నటన పరంగానే కాకుండా శృతికి నచ్చితే ఆ సినిమాలో పాట కూడా పాడుతూ వస్తుంది. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో పాటలు పాడిన ఈ చెన్నై సొగసరి తాజాగా మరోసారి తన గళాన్ని సవరించుకుంది.
తమిళ స్టార్ విజయ్ హీరోగా రూపొందుతోన్న పీరియాడిక్ ఫిలిం పులి` చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఓ సాంగ్ ను సింగేసింది. వందకోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రంలో శ్రీదేవి సౌమ్యాదేవిగా కనిపిస్తుంది. హన్సిక మరో హీరోయిన్ గా కనిపిస్తుంది. చింబుదేవన్ దర్శకుడు. ఆగస్ట్ 2న ఈ సినిమా ఆడియో ఉంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments