శ్రుతికి సీన్ రివర్సయిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రుతి హాసన్.. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో త్రిభాషా నటిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్. అన్ని చోట్లా సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. గతేడాది అయితే.. మూడు భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటించి విజయాలను అందుకొంది. హిందీలో అక్షయ్ కుమార్‌తో 'గబ్బర్ ఈజ్ బ్యాక్' చేసి హిట్ కొట్టిన శ్రుతి.. తెలుగులో మహేష్‌తో 'శ్రీమంతుడు' బ్లాక్ బస్టర్ అందుకుంది. తమిళంలో అజిత్ తో 'వేదాళమ్' రూపంలో మరో సూపర్ హిట్.
విజయ్‌తోనూ 'పులి' చేసింది కానీ ఆడలేదు. 'పులి'ని మినహాయిస్తే.. గతేడాది మూడు భాషల్లోనూ స్టార్ హీరోలతో రాణించిన శ్రుతికి.. ఈ ఏడాది ఎలా ఉండాలి? అదే రేంజ్‌లో స్టార్ లతో సందడి చేసే అవకాశముండాలి కదా! కానీ ఇక్కడే సీన్ రివర్సయ్యింది. మూడు భాషల్లోనూ మీడియం హీరోల సినిమాలే శ్రుతి చేతిలో ఉన్న ఈ ఏడాది చిత్రాలు.
తెలుగులో నాగచైతన్యతో 'ప్రేమమ్'.. హిందీలో ఇప్పటికే రిలీజైన 'రాకీ హ్యాండ్సమ్' కోసం జాన్ అబ్రహంతో.. కమల్ హాసన్‌తో నటిస్తున్న 'శభాష్ నాయుడు' (తమిళ్, తెలుగు, హిందీ)లో మను నారాయణ్‌తో శ్రుతి జోడీ కట్టింది. వీళ్లందరూ స్టార్ హీరోలు కాని వారే. ఈ చిత్రాలకి భిన్నంగా 'ఎస్3' (యముడు పార్ట్ 3)లో సూర్యతో కలిసి నటిస్తోంది. ఇదొక్కటే శ్రుతి రేంజ్‌కి చెప్పుకోదగ్గ సినిమా. ట్విస్ట్ ఏమిటంటే.. 'ఎస్3'లో అనుష్కనే మెయిన్ హీరోయిన్. శ్రుతిది కీలక పాత్ర మాత్రమే అని కోలీవుడ్ టాక్. ఏదీ ఏమైనా గతేడాది ఒకలా.. ఈ ఏడాది మరోలా ఉంది శ్రుతి హాసన్‌కి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com