అందుకే....నేను కామెంట్స్ ను పట్టించుకోను - శృతిహాసన్
Friday, October 14, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అనగనగా ఓ థీరుడు, ఓ మై ఫ్రెండ్, గబ్బర్ సింగ్, బలుపు, ఎవడు, రేసుగుర్రం...తదితర చిత్రాల్లో నటించి మెప్పించిన అందాల తార శృతిహాసన్. తాజాగా అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి తెరకెక్కించిన ప్రేమమ్ చిత్రంలో శృతిహాసన్ నటించింది. ఈ చిత్రంలో తను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ కు భిన్నంగా ఉండే లెక్చరల్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి యూత్ ను విశేషంగా ఆకట్టకుంటుంది. దసరా కానుకగా రిలీజైన ప్రేమమ్ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ తో సక్సస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రేమమ్ గురించి శృతిహాసన్ తో ఇంటర్ వ్యూ మీకోసం...!
ప్రేమమ్ గురించి మీకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి..?
ఈ మూవీకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అని తెలిసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అని తెలిసింది. చైతన్య, చందు.. టీమ్ అంతా ఈ మూవీ కోసం చాలా హార్డ్ వర్క్ చేసారు. ఫైనల్ గా మూవీ సక్సెస్ అయ్యింది సో..వెరీ హ్యాపీ..!
ఈ మూవీలో చైతన్య లవ్ లెటర్ రాసి ఇస్తాడు కదా..! రియల్ లైఫ్ లో మీకు ఎవరైనా లవ్ లెటర్ రాసి ఇచ్చారా..?
నాకు ఎవరూ లవ్ లెటర్ రాసి ఇవ్వలేదు. నేనే రాసి ఇచ్చాను..! (నవ్వుతూ...)
మలయాళం ప్రేమమ్ చూసారా..? మలయాళం ప్రేమమ్, తెలుగు ప్రేమమ్ రెండింటి గురించి మీరు ఏం చెబుతారు..?
మలయాళం ప్రేమమ్ చూసాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇక ఈ మూవీలో నా క్యారెక్టర్ ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయం పై డైరెక్టర్ చందుతో డిస్కస్ చేసి ఈ క్యారెక్టర్ చేసాను. చందు తెలుగు నేటివిటికి తగ్గట్టు తనదైన స్టైల్ లో ఈ మూవీ తీసాడు. ఓరిజినల్ ప్రేమమ్ తో ఈ చిత్రాన్ని కంపేర్ చేయకూడదు.
ఈ మూవీలో మేకప్ లేకుండా నటించారు కదా..?
నాకు మేకప్ లేకుండా చేయడం ఇష్టం. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే....నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కి కంప్లీట్ డిఫరెంట్ గా ఉన్న రోల్ ఇది. సితార చాలా సాఫ్ట్ గా, కామ్ గా ఉంటుంది. కానీ..నేను అలా కాదు.
సోషల్ మీడియాలో మీ క్యారెక్టర్ గురించి కామెంట్స్ వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు..?
సినిమా అనేది బేబీ లాంటిది. బేబీ పుట్టే వరకు రూపం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అలాగే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎలా ఉంటుందో తెలియదు. అలాంటిది సినిమా ఎలా వస్తుందో తెలియకుండానే కామెంట్స్ చేయడం ఏమిటి..? అయినా నా పేరులో హాసన్ ఉంది. నేను కమల్ హాసన్ కూతుర్ని. అందుచేత నేను ఇలాంటి కామెంట్స్ ను పట్టించుకోను..!
ఈ మూవీలో మీరు గతం మరచిపోతారు కదా..! క్లైమాక్స్ సీన్ లో చైతన్య ని కలుస్తారు. ఇంతకీ చైతన్య ఎవరో గుర్తుపట్టరా..? లేదా..?
మీరు సినిమా చూసారు కదా..! మీకు ఎలా అర్ధం అయితే అలా...(నవ్వుతూ...)
నాగ చైతన్యతో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?
చైతన్య ఎప్పటి నుంచో నాకు మంచి ఫ్రెండ్. చాలా మంచోడు..! నా ఫ్రెండ్ తో వర్క్ చేయడం అంటే స్కూల్ ట్రిప్ కి వెళ్లినట్టు అనిపించింది. ఈ మూవీలో చైతన్య చాలా బాగా నటించాడు. చైతన్యకి సక్సెస్ రావడం సంతోషంగా ఉంది.
పవన్ కళ్యాణ్ తో రెండోసారి నటిస్తున్నారు కదా..! కాటమరాయుడు ఫస్ట్ డే షూటింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది..?
పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ నా లైఫ్ నే మార్చేసింది. సో...పవన్ తో వర్క్ చేయడం అంటే నాకు వెరీ స్పెషల్. సెకండ్ టైమ్ వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.
ప్రేమమ్ రీమేక్...ఇప్పుడు పవన్ తో నటిస్తున్న మూవీ కూడా రీమేకే..?
అవునండి..! తెలుగు, తమిళ్, హిందీలో నేను ఎక్కువుగా రీమేక్ మూవీస్ లో నటిస్తున్నాను. నేను రీమేక్ రాణిని..(నవ్వుతూ..)
నాన్న కమల్ తో శభాష్ నాయుడు సినిమా చేస్తున్నారు కదా..? నాన్నతో షూటింగ్ ఎలా ఉంది..?
నాన్నతో షూటింగ్ చాలా ఎంజాయ్ చేసాను. చాలా నేర్చుకున్నాను. నాన్నతో వర్క్ చేయడం అంటే ఒక అద్భుతమైన అనుభవం.
ఈ సినిమా షూటింగ్ లో గౌతమీతో మీకు విభేదాలు వచ్చినట్టు వార్తలు వచ్చాయి నిజమేనా..?
అలాంటిది ఏమీ లేదు. ఎవరో ఏదో రాసారు అంతే. గాసిప్స్ గురించి నేను అంతగా పట్టించుకోను..!
లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయాలనుకుంటున్నారా..?
నాకు చేయాలని ఉంది. అయితే...లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాలంటే మంచి స్టోరీ ఉండాలి. స్టోరీ బాగుంటే ఖచ్చితంగా చేస్తాను.
ప్రొడక్షన్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టున్నారు..?
ప్రొడక్షన్ పెట్టాలనే ఆలోచన అయితే ఉంది. అయితే...ఇప్పుడు మాత్రం కాదు దానికి ఇంకా టైమ్ ఉంది.
బి ది బిట్చ్ అంటూ మీ ఆలోచనలను వీడియో రూపంలో రిలీజ్ చేసారు కదా..?
నాకు లేడీస్ కి సంబంధించిన టాపిక్స్ గురించి రాయడం అంటే ఇష్టం. అందుకే నా ఆలోచనలను బి ది బిట్చ్ అని వీడియో రూపంలో తీసుకువచ్చాను. ఫ్యూచర్ లో లేడీస్ కి సంబంధించిన మరిన్ని విషయాలు గురించి రాయాలి అనుకుంటున్నాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్...?
తెలుగులో పవన్ కళ్యాణ్ మూవీ చేస్తున్నాను. సూర్య తో సింగం 3 చేస్తున్నాను. నాన్నతో కలిసి శభాష్ నాయుడు చేస్తున్నాను. కొన్ని ప్రాజెక్ట్స్ గురించి డిష్కసన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఎనౌన్స్ చేస్తాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments