సింగం 3 లో శ్రుతి హాసన్ పాత్ర ఇదే..
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య హీరోగా హరి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం సింగం 3. సూర్య నటించిన సింగం 1, సింగం 2 ఈ రెండు చిత్రాలు ఘన విజయాలు సాధించడంతో సింగం 3 పై మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో సూర్య సరసన అనుష్క, శ్రుతి హాసన్ నటిస్తున్నారు. శ్రుతి హాసన్..సి.ఐ.డి ఆఫీసర్ గా నటిస్తున్నట్టు సమాచారం.
క్రిమినల్స్ ను పట్టుకోవడంలో హీరో సూర్యకి సహకరించే సి.ఐ.డి ఆఫీసర్ గా శ్రుతి హాసన్ ఫైట్స్ కూడా చేస్తుందట. ఈ నెల 18 నుంచి కలకత్తాలో ఈ సినిమా షూటింగ్ చేయనున్నారు. ఈ షూట్ లో శ్రుతి హాసన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఓ వైపు ప్రేమమ్ రీమేక్ లో లెక్చరల్ గా నటిస్తూ...మరో వైపు సింగం 3లో సి.ఐ.డి. ఆఫీసర్ గా నటిస్తూ...వైవిధ్యం కోసం తపిస్తున్న శ్రుతి హాసన్ భవిష్యత్ లో మరిన్ని వైవిధ్యమైన పాత్రలు పోషిస్తుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com