శృతిహాస‌న్ చూపిస్తానంటున్న ‘ఎడ్జ్‌’

  • IndiaGlitz, [Saturday,August 08 2020]

రెండేళ్ళ క్రితం వరకు స్టార్ హీరోయిన్ హోదాలో ఓ వెలుగు వెలిగిన క‌థానాయిక శృతి హాసన్. కాని గత ఏడాది కాలం నుంచి ఈమె న‌టించిన‌ ఒక్క సినిమా కూడా ద‌క్షిణాదిలో విడుదల కాలేదు. తమిళంలో ‘ఎస్3’, తెలుగులో ‘కాటమరాయుడు’ సినిమాల తర్వాత శృతి.. దక్షిణాదిన దాదాపు కనుమరుగైపోయారు. ఈ క్రమంలో ఆమె ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్టు, అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు కథనాలు వినిపించాయి. కానీ లవ్ బ్రేకప్ కావడంతో శృతిహాస‌న్ మ‌ళ్లీ సినిమాలు, మ్యూజిక్ కాన్‌స‌ర్ట్‌ల‌పై ఫోక‌స్ చేసింది. నిజానికి శృతిహాస‌న్ హీరోయిన్ కాక‌ముందు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గానే ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు. హీరోయిన్‌గా మారిన త‌ర్వాత ఏమాత్రం ఖాళీ దొరికినా మ్యూజిక్‌పై ఫోక‌స్ చేస్తుంటారు.

మీరీ ముఖ్యంగా ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో శృతి ఫోక‌స్ అంతా మ్యూజిక్‌పైనే పెట్టింది. అందులో భాగంగా ‘ఎడ్జ్‌’ అనే ఆల్బ‌మ్‌ను రూపొందించారు శృతిహాస‌న్‌. ఇందులో ‘టేక్ మీ టు ఎడ్జ్‌..’ అనే పాట‌ను ఈరోజు విడుద‌ల చేశారు శృతి. ఈ ఆల్బమ్‌కు శృతి మ్యూజిక్‌ను కంపోజ్ చేయ‌డ‌మే కాకుండా, పాట‌లు కూడా పాడింద‌ట‌. అసంపూర్ణ‌మైన ప్రేమ‌ను తెలియ‌జేసేలా ఈ ఆల్బ‌మ్‌ను డిజైన్ చేశాన‌ని శృతి తెలిపారు.