ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుండి శృతి తప్పుకుంది...
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి తర్వాత ఆ రేంజ్‌లో పీరియాడికల్ సినిమాను నిర్మించడానికి కోలీవుడ్ నిర్మాణ సంస్థ తెన్నాండల్ ఫిలింస్ ముందుకొచ్చింది. `సంఘమిత్ర` టైటిల్‌తో 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాకు సుందర్.సి దర్శకుడు. శృతిహాసన్ టైటిల్ పాత్రలో నటిస్తుండగా, ఆర్య, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తారని అధికారకంగా ప్రకటించారు.
కేన్స్‌లో ఈ సినిమాను లాంఛనంగా అనౌన్స్ చేసి పోస్టర్స్ కూడా విడుదల చేశారు. సినిమా కోసం శృతిహాసన్ లండన్‌లో కత్తియుద్ధాలు కూడా నేర్చుకుంది. అంతా సజావుగానే సాగుతుందని అనుకుంటున్న తరుణంలో కొన్ని అనివార్య కారణాలతో శృతిహాసన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని నిర్మాణ సంస్థతో పాటు, శృతిహాసన్ సన్నిహిత వర్గాలు కూడా ధృవీకరించాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com