శృతికి అదిస్తే చాలు..

  • IndiaGlitz, [Monday,June 26 2017]

సాధారణంగా సినిమా హీరోయిన్లు లుక్స్ ప‌రంగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉంటారు. ప్ర‌స్తుతం ట్రెండ్‌కి తగ్గట్టు ఎప్పటికప్పుడు తమ దుస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు. అభిమానులు, యూత్ విష‌యానికి వ‌స్తే తమ అభిమాన హీరోయిన్‌ వేసుకున్న డ్రెస్‌లాంటిదే వేసుకోవాలని, ఆమెలా రెడీ అవ్వాలని ఆలోచిస్తుంది. కానీ, కానీ తాను మాత్రం అందుకు మిన‌హాయింపు ఇవ్వ‌మందిట‌.ఎందుకంటే శృతికి బ్రాండెడ్‌ దుస్తులు వేసుకోవడం అస్సలు ఇష్టం వుండదట.

తన దగ్గర వున్న బ్రాండెడ్‌ డ్రెస్‌లు ఎవరో ఒకరు బహుమతులుగా ఇచ్చినవే తప్ప తన చేతులారా కొన్నవి మాత్రం కాదట. తను వేసుకునే డ్రెస్సుల్లో ఎక్కువ శాతం మెగా డిస్కోంట్‌లో కొన్నవేనట. తనకు తెలిసి అంతకు మించి బ్రాండెడ్‌ దుస్తులు వేసుకోవాల్సిన అవసరం లేదంటోంది శృతి. ట్రెండ్‌కి తగ్గట్టు డ్రెసింగ్‌ కూడా మారాలని ఫ్రెండ్స్‌ చెబుతున్నా అవేవీ శృతి పట్టించుకోదట. తనకి నచ్చకపోతే అవి ఎంత ఫ్యాషన్‌ డ్రెస్‌ అయినా, ఎంత ఖరీదైనవి అయినా వేసకోనని చెప్తోంది శృతి.

More News

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.ఆర్ బయోపిక్

సమాజానికి మార్గదర్శకం చూపిన ఎందరి జీవితాలను ఇప్పుడు సినిమాలుగా తెరరకెక్కిస్తున్నారు. అందులో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

జూన్ 30న విడుదలకానున్న సంపూర్ణేష్ బాబు 'వైరస్'

సంపూర్ణేష్ బాబు టైటిల్ పాత్రలో ఎ.ఎస్.ఎన్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "వైరస్". "నో వేక్సిన్, ఓన్లీ టాక్సిన్" అనేది ట్యాగ్ లైన్. గీత్ షా కథానాయిక. సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పుల్లరేవు రామచంద్రారెడ్డి సమర్పిస్తున్నారు.

దసరా కానుకగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జై లవకుశ'

`టెంపర్`, `నాన్నకు ప్రేమతో`, `జనతాగ్యారేజ్` వంటి బ్లాక్బస్టర్స్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం `జై లవకుశ`. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హీరో రవితేజ సోదరుడు...నటుడు భరత్ మృతి

ప్రముఖ హీరో రవితేజ సోదరుడు భరత్ కారు ప్రమాదంలో మరణించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ సమీపంలో జౌటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని భరత్ ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది.

'కురుక్షేత్రం' తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది - యాక్షన్ కింగ్ అర్జున్

వెండితెరపై మార్షల్ ఆర్ట్స్ కు మంచి గుర్తింపు తెచ్చిన అర్జున్.. ఇమేజ్ నే ఇంటిపేరుగా మార్చుకుని యాక్షన్ కింగ్ గా మారాడు. యాక్షన్ హీరోగా దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచుతుడైన అర్జున్..