ప్రియుడితో కమల్‌ను కలిసిన శ్రుతిహాసన్..!
Send us your feedback to audioarticles@vaarta.com
మొన్నటి వరకు మైకేల్‌తో ప్రేమాయణం నెరిపిన శ్రుతిహాసన్, ప్రేమలో ఉన్న సమయంలో సినిమాలకు దూరమైంది. అంతా ఓకే అనుకున్న సమయంలో మైకేల్‌తో లవ్ బ్రేక్ అయ్యింది. కొన్నిరోజుల పాటు అందరికీ దూరంగా ఉన్న శ్రుతిహాసన్. మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. సినిమాలు, మ్యూజిక్ కన్సర్ట్స్తో బిజి బిజీగా మారిన శ్రుతి.. ఇప్పుడు శంతను హజరికాతో ప్రేమలో పడింది. అయితే ఈసారి తన ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచాలనుకోలేదు. ప్రియుడితో ఉన్న ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లోషేర్ చేస్తుంది. రీసెంట్గా శంతను క్లోజ్ఉన్న ఫొటోలను షేర్ చేసిన శ్రుతి హాసన్ చిల్లింగ్ మూమెంట్స్ అంటూ పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్స్ మిశ్రమ స్పందనను తెలిపారు.
ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే శ్రుతి, శంతను హజరికాను కమల్ హాసన్‌కు పరిచయం చేసింది. రాజకీయ పార్టీ, ప్రచారంతో బిజీగా ఉన్న కమల్‌హాసన్‌ను బిజీ షెడ్యూల్ కారణంగా కలవలేకపోయిన శ్రుతి.. చాలా రోజుల తర్వాత కలిశానని తెలియజేస్తూ కమల్‌హాసన్‌తో ఉన్న ఫొటోలను కూడా షేర్ చేసింది. సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది క్రాక్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌ను దక్కించుకున్న శ్రుతి, ఇప్పుడు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న సలార్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments