శ్రుతికి ఆ వాసనంటే ఇష్టమట!!
- IndiaGlitz, [Wednesday,April 29 2020]
యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ తనయ శ్రుతిహాసన్ కొన్నాళ్ల పాటు ప్రేమ, బ్రేకప్ వంటి కారణాలతో సినీ రంగానికి దూరమైంది. అయితే ఇప్పుడిప్పుడే సినీ రంగంలో మరో ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది. తెలుగులో రవితేజతో క్రాక్ సినిమాలో శ్రుతి జోడీ కట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా క్వారంటైన్లో ఉన్న శ్రుతిహాసన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరించారు. మీరు ఎలాంటివి ఇష్టపడతారు అని అభిమానులు అడిగితే శ్రుతిహాసన్ బదులిస్తూ ‘‘నాకు పెన్సిల్, చాక్లెట్, గులాబితో పాటు పొగాకు, సిగరెట్ వాసనంటే ఇష్టం. కానీ వాటిని కాల్చినప్పుడు వచ్చే వాసన ఇష్టం ఉండదని, చిన్నప్పుడు ఎరేజర్ వాసనను బాగా ఇష్టపడేదాన్ని’’అని కూడా శ్రుతిహాసన్ తెలిపారు.
సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా కంటే ముందు గాయని, మ్యూజిక్ డైరెక్టర్‌గానే ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బాలీవుడ్ చిత్రంలో నటించింది. తర్వాత తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమాలో సిద్ధార్థ్ సరసన నటించింది. అయితే కెరీర్ ప్రారంభంలో ఈమె నటించిన సినిమాలేవీ హిట్ కాలేదు. అయితే గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత శ్రుతిహాసన్ స్టార్హీరోయిన్ స్థాయికి ఎదిగింది. నేటి తరం అగ్ర కథానాయకులందరితో ఆడిపాడిందీ చెన్నై భామ.