సలార్‌లో శృతిహాసన్ క్యారెక్టర్‌కు పవన్ కుమార్తె పేరు.. పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్
Send us your feedback to audioarticles@vaarta.com
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ జంటగా నటిస్తున్న తొలి సినిమా 'సలార్'. 'కె.జి.యఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ రోజు శృతి హాసన్ పుట్టినరోజును పురస్కరించుకుని.. సలార్‌లో ఆమె లుక్ విడుదల చేశారు. అంతేకాదు క్యారెక్టర్ పేరు కూడా రివీల్ చేశారు మేకర్స్.
'సలార్'లో శృతిహాసన్ పేరు ‘‘ఆద్య’’ . పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రేణూ దేశాయ్ కుమార్తె పేరు కూడా ఆద్య అనే సంగతి తెలిసిందే. ఇందులో శృతిహాసన్ జర్నలిస్ట్‌గా నటిస్తున్నట్లు సమాచారం. 'సలార్'లో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.
మరోవైపు నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK107 సినిమాలో కూడా శృతి హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. 'బలుపు', 'క్రాక్' తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతి నటిస్తోన్న మూడో చిత్రమిది. అలాగే చిరంజీవి - బాబీ ప్రాజెక్టులోను హీరోయిన్‌గా శృతిహాసన్ పేరే వినిపిస్తోంది. సినిమాలతో పాటు ఓటీటీపై కూడా దృష్టి పెట్టినట్టు వెల్లడించింది శృతిహాసన్. త్వరలోనే తను నటించిన బెస్ట్ సెల్లర్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోందని ప్రకటించింది. ఈ వెబ్ సిరీస్ లో లీడ్ క్యారెక్టర్ పోషించింది శృతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com