శృతిహాస‌న్ ఐటెమ్ సాంగ్‌...

  • IndiaGlitz, [Wednesday,August 24 2016]

ద‌క్షిణాది, ఉత్త‌రాదిన బిజీ హీరోయిన్స్‌లో శృతిహాస‌న్ ఒక‌రు. కేవలం హీరోయిన్‌గానే కాకుండా గాయ‌నిగా కూడా శృతిహాస‌న్ సంద‌డి చేస్తుంటుంది. అలాగే స్పెష‌ల్ సాంగ్స్‌లో కనిపించి క‌నువిందు చేస్తుంటుంది. తాజాగా ఓ స్పెష‌ల్ సాంగ్‌లో చేయ‌మ‌ని స‌ద‌రు చిత్ర‌యూనిట్ శృతిహాస‌న్‌ను సంప్ర‌దిస్తున్నార‌ట‌.

క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి త‌న‌యుడు నిఖిల్ కుమార్ హీరోగా మ‌హ‌దేవ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం జాగ్వార్. తెలుగు, క‌న్న‌డంలో భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్ కోసం శృతిహాస‌న్‌ను న‌టింప‌చేయాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. మ‌రి శృతిహాస‌న్ ఏం చెబుతుందో చూడాలి.