శృతి హాసన్ కొత్త చిత్రానికి ఓకే చెప్పిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
రెండేళ్ళ క్రితం వరకు స్టార్ హీరోయిన్ హోదాలో ఓ వెలుగు వెలిగిన కథానాయిక శృతి హాసన్. కాని గత ఏడాది కాలం నుంచి ఈమె నటించిన ఒక్క సినిమా కూడా దక్షిణాదిలో విడుదల కాలేదు. తమిళంలో ‘ఎస్3’, తెలుగులో ‘కాటమరాయుడు’ సినిమాల తర్వాత శృతి.. దక్షిణాదిన దాదాపు కనుమరుగైపోయారు. ఈ క్రమంలో ఆమె ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్టు, అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు కథనాలు వినిపించాయి.
అయితే ఆ కథనాలకు తెర దించుతూ.. ప్రస్తుతం ఆమె ఒక హిందీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం.. యదార్థ సంఘటన ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు మహేష్ మంజ్రేకర్ తెరకెక్కించబోయే మూవీలో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ‘కమాండో’ సిరీస్ హీరో విద్యుత్ జామ్వల్తో కలిసి ఈ సినిమా కోసం తెరను పంచుకోనున్నారు శృతి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. అలాగే తెలుగు, తమిళ భాషల్లోనూ సినిమాలు చేసేందుకు శృతి సిద్ధమవుతోందని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments