శృతి హాస‌న్ కొత్త చిత్రానికి ఓకే చెప్పిందా?

  • IndiaGlitz, [Saturday,March 31 2018]

రెండేళ్ళ క్రితం వరకు స్టార్ హీరోయిన్ హోదాలో ఓ వెలుగు వెలిగిన క‌థానాయిక శృతి హాసన్. కాని గత ఏడాది కాలం నుంచి ఈమె న‌టించిన‌ ఒక్క సినిమా కూడా ద‌క్షిణాదిలో విడుదల కాలేదు. తమిళంలో ‘ఎస్3’, తెలుగులో ‘కాటమరాయుడు’ సినిమాల తర్వాత శృతి.. దక్షిణాదిన దాదాపు కనుమరుగైపోయారు. ఈ క్రమంలో ఆమె ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్టు, అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు కథనాలు వినిపించాయి.

అయితే ఆ కథనాలకు తెర దించుతూ.. ప్రస్తుతం ఆమె ఒక హిందీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం.. యదార్థ‌ సంఘ‌ట‌న ఆధారంగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు మహేష్ మంజ్రేకర్ తెరకెక్కించబోయే మూవీలో  ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ‘కమాండో’ సిరీస్ హీరో విద్యుత్ జామ్వల్‌తో కలిసి ఈ సినిమా కోసం తెరను పంచుకోనున్నారు శృతి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. అలాగే తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ సినిమాలు చేసేందుకు శృతి సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది.

More News

విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రానికి త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడు

‘పెళ్లిచూపులు’, అర్జున్ రెడ్డి’ చిత్రాల విజ‌యాల‌తో యూత్ స్టార్ విజయ్ దేవరకొండ

'2 స్టేట్స్‌' లో మిస్ విజ‌య‌వాడ‌

ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం '2 స్టేట్స్‌'.

మ‌ల్టీస్టార‌ర్ కోసం మూడు నిర్మాణ సంస్థ‌లు...

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ సంస్కృతి ఎక్కువ అవుతుంది. అందులో భాగంగా విక్ట‌రీ వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ రూపొంద‌నుంది.

ఆరో స్థానంలో 'రంగ‌స్థ‌లం'

1985 కాలం నాటి ప‌రిస్థితుల‌తో.. గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రంగా 'రంగస్థలం' చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సుకుమార్.

చ‌ర‌ణ్ ఎంట్రీ డేట్ ఫిక్స‌య్యింది...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.