శృతి మించిన శృతిహాస‌న్..

  • IndiaGlitz, [Friday,February 26 2016]

అందం - అభిన‌యంతో ఆక‌ట్టుకున్న అందాల క‌థానాయిక శృతిహాస‌న్. తెలుగు,తమిళ‌, హిందీ చిత్రాల్లో న‌టిస్తూ..త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకుంది. తెలుగులో ఇటీవ‌ల సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌ర‌స‌న శ్రీమంతుడు సినిమాలో న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇదిలా ఉంటే...శృతిహాస‌న్ హిందీలో రాఖీ హాండ్సమ్ అనే సినిమాలో న‌టిస్తుంది. జాన్ అబ్ర‌హం హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని నిశికాంత్ కామ‌త్ తెర‌కెక్కిస్తున్నారు.

ఇది యాక్ష‌న్ మూవీ అయిన‌ప్ప‌టికీ ఈ సినిమాలో కావ‌ల్సినంత రొమాన్స్ ఉంది. ఇటీవ‌ల ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఈ పాట‌లో జాన్ అబ్ర‌హంతో శృతి హాస‌న్ శృతి మించి రొమాన్స్ చేస్తుండ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సాంగ్ చూసిన వాళ్లు క‌మ‌ల్ కుమార్తె మ‌రి ఇంత‌లా శృతి మించాలా అంటున్నార‌ట‌. మార్చి 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత శృతి మించిన శృతిహాస‌న్ పై ఇంకెన్ని కామెంట్స్ వ‌స్తాయో...వాటికి శృతి ఏం స‌మాధానం చెబుతుందో..చూద్దాం.

More News

నిన్న వ‌ర్మ‌, విష్ణు నేడు సాయి కొర్ర‌పాటి...

ఈగ‌, అందాల రాక్ష‌సి, లెజెండ్, ఊహ‌లు గుస‌గుసలాడే, దిక్కులు చూడ‌కురామయ్య‌...ఇలా విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించి అన‌తి కాలంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్ననిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న‌చిత్రం.

'ధనాధన్' పాటలు విడుదల

వైభవ్,రమ్యా నంబీసన్ జంటగా తమిళంలో రూపొందిన 'డమాల్ డుమీల్'చిత్రాన్ని బ్లాక్ బస్టర్ మూవీ మేకర్స్ పతాకంపై 'ధనాధన్'

కోర్టులో శ్రీమంతుడు

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన శ్రీమంతుడు సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.

కమల్ న్యూమూవీ టైటిల్..

కమల్ హాసన్ ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు.

సరైనోడు రిలీజ్ డేట్...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ -బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న సరైనోడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.