శ్రుతి.. శ్రుతి చేస్తోంది!

  • IndiaGlitz, [Friday,October 05 2018]

క‌మ‌ల్ త‌న‌య శ్రుతి హాస‌న్ న‌టి కాక‌మునుపే మంచి సంగీత ద‌ర్శ‌కురాలు. సంగీతంలో వివిధ ఫార్మ్ ల‌పై ఆమెకు మంచి ప‌ట్టు ఉంది. ఇటీవ‌ల కొన్నాళ్లుగా వెండి తెర‌మీద అంత‌గా బిజీగా లేని శ్రుతి ఇప్పుడు త‌న సంగీత ప‌రికరాల‌ను శ్రుతి చేస్తోంది. తాజాగా ఆమె ఎల‌క్ట్రానిక్ మ్యూజిక్ ప్రొడ్యూస‌ర్ న్యూక్లియాతో క‌లిసి ఓ ఆల్బ‌మ్‌కు ప‌నిచేశారు.

ఈ ఆల్బ‌మ్‌లో ఉన్న పాట‌కు శ్రుతి హాస‌న్ సొంతంగా పాట రాసి, ఆమె పాడారు. న్యూక్లియాతో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, ఈ ఆల్బ‌మ్‌ను న‌వంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు ఆమె తెలిపారు. శ్రుతిహాస‌న్ చాలా టాలెంటెడ్‌ప‌ర్స‌న్‌. అంత టాలెంట‌డ్ ప‌ర్స‌న్ తో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది.

ఇందులో ఆమె రాసిన లిరిక్స్, పాడిన విధానానికి, ఆమెకున్న సంగీత ప‌రిజ్ఞానానికి ఆశ్చ‌ర్య‌పోవ‌డం నా వంత‌యింది అని న్యూక్లియా అన్నారు. సో శ్రుతి ఇటు న‌ట‌న‌తో పాటు, త‌న బేస్ అయిన సంగీతాన్ని కూడా వ‌ద‌ల‌డం లేద‌న్న‌మాట‌. న‌వంబ‌ర్‌లో శ్రుతి చేసిన సంగీతాన్ని మ‌నంద‌రం కూడా వినేయొచ్చు.